World Sparrow Day: పిచ్చుకలు అంతరిస్తే ఏమవుతుంది.. నాశనం తప్పదా..
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:29 PM
పిచ్చుకల్ని చంపటం కారణంగా చైనా వినాశనాన్ని చూసింది. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆకలి చావులు చచ్చారు. దెబ్బకు మళ్లీ పిచ్చుకల్ని వేరే దేశం నుంచి తెప్పించుకుని పెంచారు. పిచ్చుకలు లేకపోతే ప్రతీ దేశం పరిస్థితి అదే అవుతుంది.

ఈ భూమి కేవలం మనిషి సొత్తు మాత్రమే అనుకుంటే చావుతో తల గోక్కున్నట్టే. తన స్వార్థం కోసం మనిషి ఏ జీవికి అన్యాయం తలపెట్టినా.. అది అతడిపైనే ప్రభావం చూపుతుంది. ఈ ఎకో సిస్టమ్‌లో ప్రతీ జీవికి ప్రాధాన్యత ఉంటుంది. వాటి ప్రాణాలతో మనం ఆడుకుంటే.. మన ప్రాణాలతో ప్రకృతి ఆడుకుంటుంది. దీనిపై మీకు ఓ ఉదాహరణ చెబుతాను. 1958లో పిచ్చుకల కారణంగా చైనాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇది గుర్తించిన ప్రభుత్వం ఓ దారుణమైన నిర్ణయానికి తెర తీసింది. పంటల్ని దెబ్బ తీస్తున్న పిచ్చుకలను చంపేయాలని ప్రజల్ని ఆదేశించింది. దీంతో ప్రజలు రెచ్చిపోయారు. పిచ్చుకలను చంపటం మొదలుపెట్టారు. వాటి గూళ్లను నాశనం చేశారు. గుడ్లను పగుల గొట్టారు. దీని కారణంగా 30 లక్షల పిచ్చుకలు చనిపోయాయి.
పంటలకు పట్టిన పీడ పోయిందని ప్రభుత్వం, ప్రజలు భావించారు. కానీ, తర్వాత ముంచుకురాబోయే పెను ప్రమాదాన్ని, పెను వినాశనాన్ని వారు గుర్తించలేకపోయారు. ఈ ఎకో సిస్టమ్ గురించి సరైన అవగాహన లేని మూర్ఖులైన ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి చైనా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పిచ్చుకలు లేకపోవటం వల్ల పంటలకు చీడపీడల బాధ విపరీతంగా పెరిగిపోయింది. పురుగులు పంటలను తిని పండుగ చేసుకున్నాయి. పిచ్చుకలు ఉంటే గోటితో పోయేది.. పురుగుల కారణంగా గొడ్డలి వరకు వచ్చింది. పంటలు మొత్తం నాశనం అయ్యాయి. ఆహార కొరత ఏర్పడింది. తినడానికి తిండలేక ఏకంగా 4.5 కోట్ల మంది చైనా ప్రజలు ప్రాణాలు విడిచారు. ప్రభుత్వానికి తాము చేసిన తప్పు ఏంటో అర్థం అయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు మొదలెట్టింది. సోవియల్ యూనియన్ నుంచి వేల పిచ్చుకలను చైనాకు తెప్పించుకుంది. పిచ్చుకలు వచ్చిన తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.
దారుణంగా తగ్గిపోయిన పిచ్చుకల సంఖ్య..
1990 దశకం మొదట్లో దేశ వ్యాప్తంగా పిచ్చుకల సంఖ్య బాగా ఉండేది. తర్వాతి కాలంలో అది తగ్గతూ వచ్చింది. ఎంతలా అంటే.. 30 ఏళ్లలో పిచ్చుకల సంఖ్య 80 శాతం తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇంకా దారుణం ఏంటంటే 2003 నాటికి తిరువనంతపురం ప్రాంతంలో అసలు పిచ్చుకలే లేకుండా అంతరించిపోయాయి. ఇక, లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో 2013నుంచి పిచ్చుకలు అసలు కనిపించడమే లేదు. పిచ్చుకలు అంతరించిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి అడవుల్ని కొట్టివేయడం, నగరీకరణ, పురుగు మందులు విపరీతంగా వాడటం, రేడియేడిషన్.
పిచ్చుకలు అంతరిస్తే ఏమవుతుంది?..
సింపుల్‌గా చెప్పాలంటే.. 1958లో చైనాకు పట్టిన గతే ఇండియాకు కూడా పడుతుంది. ఒక్కో ప్రమాదాన్ని వివరించి చెప్పాలంటే.. ముందుగా మన ఎకో సిస్టమ్ దెబ్బ తింటుంది. పురుగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దాని ప్రభావం మొదటగా పంటల మీద పడుతుంది. పంటలపై రోగాల తాకిడి పెరిగిపోతుంది. పంట నష్టం ఊహించని విధంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. పిచ్చుకలు పురుగుల్ని తినటం మాత్రమే కాదు.. పిచ్చుకల్ని తినే జంతువులు కూడా కొన్ని ఉంటాయి. వాటికి ఆహారం కరువవుతుంది. ఇది జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతుంది. ఇవన్నీ పైకి కనిపిస్తున్న.. మనిషి ఊహించగలిగే ప్రమాదాలు మాత్రమే. ఊహించని ప్రమాదాల్ని కూడా మనిషి ఎదుర్కోవల్సి వస్తుంది.కేవలం పిచ్చుకల విషయంలోనే కాదు.. అంతరించి పోయే ప్రతీ జీవి కారణంగా మానవ మనుగడ కష్టతరం అవుతూ పోతుంది. దీన్ని బుర్రలో పెట్టుకుని మనిషి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిచ్చుకల ప్రాధాన్యతను తెలియజేయడానికి వాటికంటూ ఓ రోజును కేటాయించారు. మార్చి 20వ తేదీని ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా జరుపుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి :
AC suburban train: చెన్నైలో తొలి ఏసీ సబర్బన్ రైలు..
Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు
PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..

డీసీఎం ఆశలపై నీళ్లు.. రామనగర పేరు మార్పునకు కేంద్రం ససేమిరా..

దేవాలయంలాంటి అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏం డిమాండ్ చేశారో తెలిస్తే.

రచ్చకెక్కిన దంపతుల వివాదం.. భార్య వేధిస్తోందని భర్త ఫిర్యాదు

పంజాబ్లో రైతుల అరెస్టు.. నిరసన శిబిరాల తొలగింపు

అమ్మో.. పెద్దప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
