మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్స్
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:10 AM
జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలంటే మేనేజ్‌మెంట్ కోర్సులు చేయాలనే భావం స్థిరపడి పోయింది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఇలా ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వారికైనా మేనేజ్‌మెంట్ కోర్సులు చేసే అవకాశం ఉంది. అలాగే...

మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్స్
జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలంటే మేనేజ్‌మెంట్ కోర్సులు చేయాలనే భావం స్థిరపడి పోయింది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఇలా ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వారికైనా మేనేజ్‌మెంట్ కోర్సులు చేసే అవకాశం ఉంది. అలాగే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నవారు కూడా ఈ కోర్సులు చేసి కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లగలుగుతున్నారు. కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల మేనేజ్‌మెంట్ కోర్సుల నోటిఫికేషన్ వెలువడింది. ఒకసారి పరిశీలించండి.
ఐపీఈ హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ 2025-27 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2025 మార్చి 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https://www.ipeindia.org/ వెబ్‌సైట్ చూడవచ్చు.
ఐఐఎం బోథ్‌గయ
ఐఐఎం బోద్‌గయ, టీంలీజ్ ఎడ్యుటెక్‌తో కలిసి ఆన్‌లైన్ ‘ఎగ్జిక్యూటీవ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్’(ఈఎంబీఏ)ని డిజైన్ చేసింది. ఈ రెండు సంవత్సరాల ఆన్‌లైన్ కోర్సు మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయిలో ఉన్న ఎగ్జిక్యూటీవ్‌లకు ఉపయోగడుతుంది. ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, స్ట్రాటజీ తదితర సబ్జెక్టులు ఇందులో ఉంటాయి. వివరాల కోసం https://iimbgonline.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
ప్రోగ్రామ్‌లు
పీజీడీఎం - పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం - మార్కెటింగ్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం - బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
పీజీడీఎం - ఇంటర్నేషనల్ బిజినెస్
పీజీడీఎం - హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
పీజీడీఎం - బిజినెస్ అనాల్సిస్
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, క్యాట్/గ్జాట్/జీమ్యాట్/ మ్యాట్/ సీమ్యాట్/ ఏటీఎంఏ టెస్ట్ స్కోరు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ: 2025 ఏప్రిల్ 12
‘నిట్’ కురుక్షేత్ర
హరియాణ రాష్ట్రం కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 మే 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకుhttps://nitkkr.ac.in వెబ్‌సైట్ చూడవచ్చు.
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు, క్యాట్/ సీమ్యాట్/ మ్యాట్ స్కోరు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
చివరి తేదీ: 2025 మే 5
గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీ ప్రకటన: 2025 మే 8
ఇవి కూడా చదవండి:
ప్రభుత్వ స్కీంలో కోటి రూపాయలు సంపాదించడం ఎలా..నెలకు ఎంత సేవ్ చేయాలి..
గోల్డ్‌కు గట్టి పోటీ ఇస్తున్న వెండి..ఏడాదిలో ఎంత పెరిగిందో తెలుసా..