ఇలా చేస్తే ఇంట్లోకి బల్లులు రావు..!
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:08 AM
సాధారణంగా కిటికీలు, వెంటిలేటర్ల నుంచి బల్లులు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. వీటిని సులువుగా బయటికి పంపేందుకు నిపుణులు ఈ చిట్కాలు చెబుతున్నారు...

సాధారణంగా కిటికీలు, వెంటిలేటర్ల నుంచి బల్లులు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. వీటిని సులువుగా బయటికి పంపేందుకు నిపుణులు ఈ చిట్కాలు చెబుతున్నారు.
బల్లి ఉన్న గదిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు లేదా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఓ గిన్నెలో వేసి ఉంచితే వాటి ఘాటుకి బల్లులు బయటికి వెళ్లిపోతాయి.
గిన్నెలో పది నుంచి పన్నెండు మిరియాలు వేసి అవి మునిగేదాకా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని స్ర్పే
బాటిల్‌లో పోసి బల్లులు ఉన్నచోట పిచికారీ చేస్తే బల్లులు వెళ్లిపోతాయి.
ఒక గిన్నెలో రెండు చెంచాల కాఫీ పొడి, కొద్దిగా పొగాకు వేసి కొన్ని నీళ్ల చుక్కలు చల్లి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి గది మూలల్లో ఉంచితే బల్లులు వెళ్లిపోతాయి. మళ్లీ రావు
కలరా వుండలను ఇంట్లో అక్కడక్కడ ఉంచితే వాటి వాసనకు బల్లులు వెళ్లిపోతాయి.
ఇంట్లో బూజులు లేకుండా తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటే బల్లులు రావు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..