Share News

Saudi Arabia: పండుగ కోసం వస్తాడనుకుంటే శవంగా..

ABN , Publish Date - Mar 29 , 2025 | 10:27 PM

సౌదీలో ఉంటున్న ఓ ఎన్నారై అకస్మాత్తుగా కన్నుమూశారు. కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ పండుగ జరుపుకోవాలనే తన కోరిక తీరకుండానే విగత జీవిగా స్వదేశానికి చేరుకొన్నాడు.

Saudi Arabia: పండుగ కోసం వస్తాడనుకుంటే శవంగా..

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మాతృభూమిలో కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ పండుగ జరుపుకోవాలనే తన కోరిక తీరకుండా ఒక ప్రవాసాంధ్రుడు విగత జీవిగా స్వదేశానికి చేరుకొన్నాడు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లె గ్రామానికి చెందిన శేఖ్ మొహమ్మద్ అక్బర్ చాలా కాలంగా సౌదీ అరేబియాలోని లారీ డ్రైవర్‌గా పని చేస్తుండటంతో స్వదేశంలో తన కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకొన్న సందర్భాలు అతి అరుదు. దీంతో ఈసారి రంజాన్ పండుగను ఎలాగైనా తన భార్యాపిల్లల మధ్య జరుపుకోవాలని ప్రయత్నాలు చేసుకొంటుండగా గత నెల 19న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికు తరలించే లోపే మరణించాడు.

Also Read: గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.3.3 కోట్ల ఎక్స్ గ్రేషియా విడుదల


అప్పటి నుండి అక్బర్ మృతదేహం సౌదీలో ఉండగా, భారతీయ సామాజిక కార్యకర్త ఇబ్రహీం పట్టంబీ సహాయంతో మొత్తం అధికార ప్రక్రియలు పూర్తి చేసి గురువారం స్వదేశానికి పంపించినట్లుగా ప్రవాసీ సామాజిక సేవకుడు, చిత్తూరు జిల్లాకు చెందిన రంజీత్ చిట్లూరి పేర్కొన్నారు.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2025 | 10:27 PM