Share News

UH Hinduphobic Course: హిందూమతంపై వివాదాస్పద కోర్సు.. సమర్థించుకున్న అమెరికా యూనివర్సిటీ

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:17 PM

యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో హిందూమతంపై ప్రవేశపెట్టిన కోర్సు వివాదాస్పదం కావడంతో స్పందించిన విశ్వవిద్యాలయం.. విద్యాపరమైన స్వేచ్ఛకు తాము విలువనిస్తామని స్పష్టం చేసింది.

UH Hinduphobic Course: హిందూమతంపై వివాదాస్పద కోర్సు.. సమర్థించుకున్న అమెరికా యూనివర్సిటీ

ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో హిందూమతంపై ప్రవేశపెట్టిన కోర్సు వివాదాస్పదం కావడంతో విశ్వవిద్యాలయం స్పందించింది. తమ చర్యలను సమర్థించుకుంది. విద్యాసంబంధిత స్వే్చ్ఛకు తాము విలువ ఇస్తామని, సంక్లిష్టమైన, సవాళ్లతో కూడుకున్న అంశాలను బోధించేందుకు తమ అధ్యాపకులకు అనుమతిస్తామని వెల్లడించింది. అధ్యాపకులు బోధించే ప్రతి పాఠాన్ని గమనించమని, సిలబస్ బోధనా ప్రమాణాలకు అనుగూణంగా ఉందో లేదో మాత్రమే చూస్తామని తెలిపింది. హిందూమత చారిత్రక, సామాజిక రాజకీయ నేపథ్యాలకు మాత్రమే కోర్సులో స్థానం ఉన్నట్టు పేర్కొంది.


Also Read: పండుగ కోసం వస్తాడనుకుంటే శవంగా..

ప్రొఫెసర్ అరాన్ మైఖేల్ ఉల్రే నేతృత్వంలో లివ్డ్ రిలీజియన్ కోర్సు సాగుతున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ మాధ్యమంలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అయితే, ఈ కోర్సూ హిందూమతంపై విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉందని యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి వసంత్ భట్ విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హిందూయిజం పురాతనమైదని కాదని ప్రొఫెసర్ బోధిస్తున్నట్టు ఆరోపించాడు. అది బ్రిటీష్ పాలకుల సృష్టి అని, హిందూ అతివాదుల ఆయుధమని ఆయన అంటున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, అధికారుల నుంచి ఆశించిన స్పందన రాలేదని అన్నాడు.


Also Read: గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.3.3 కోట్ల ఎక్స్ గ్రేషియా విడుదల

ఈ కోర్సు వివాదాస్పందం కావడంతో స్పందించిన విశ్వవిద్యాలయం.. విద్యార్థి ఫిర్యాదుపై సమీక్షిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తాజాగా మరో ప్రకటన విడుదల చేస్తూ కోర్సులో వివాదాస్పదమేమీ లేదని తేల్చి చెప్పింది. మరోవైపు, ప్రొఫెసర్ ఉల్రే తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అతివాదం అనే పదాన్ని అధ్యయన కోణంలో చూడాలని, హిందూమతంపై ఓ ముద్రగానో లేదా రాజకీయ వ్యాఖ్యగానో చూడొద్దని అన్నారు. ఏ మతాన్ని నిందించనని అన్నారు. ఏ మతం మౌలిక స్వభావం ఇదీ అని చెప్పే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, తన 25 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ అలా చేయలేదని అన్నాడు.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2025 | 11:17 PM