Share News

Beer Fish Viral Video : చేపతో వింత వీడియో.. బెడిసికొట్టిన ప్రయోగం.. ఇదేం పనంటూ..

ABN , Publish Date - Feb 26 , 2025 | 06:35 PM

Beer Fish Viral Video : సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షించేందుకు చేపతో వింత ప్రయోగం చేశాడు ఓ వ్యక్తి. అనుకున్నట్టే వీడియో వైరల్ అయినా రియాక్షన్ మాత్రం ఇంకోలా వచ్చింది. ఇదేంటయ్యా బాబోయ్ వ్యూస్ కోసం ఈ పనులు చేస్తారా..

Beer Fish Viral Video : చేపతో వింత వీడియో.. బెడిసికొట్టిన ప్రయోగం.. ఇదేం పనంటూ..
Beer Fish Viral Video

Beer Fish Viral Video : కొందరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వింతగా ఉంటాయి. కొన్ని విడ్డూరంగా ఉంటూ నెటిజన్లను ఆకర్షిస్తే, కొన్ని వివాదాస్పదం అవుతుంటాయి. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న ఈ వీడియో చూస్తే దీన్ని ఏ కోణంలో చూడాలో తెలియని పరిస్థితి. సముద్రంలో ఈత కొట్టే చేపను పట్టుకొచ్చి, దాని చేత బీరు కొట్టిస్తున్నాడు ఈ మేధావి. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‍‌స్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతుంది. ఇతగాడు చేసిన పనికి కొందరు అంతే వెరైటీగా కామెంట్లు పెడుతుంటే, మరికొందరు ఇదేం పని అంటూ చివాట్లు పెడుతున్నారు.


కింగ్‌'ఫిష'ర్ అని చూపించాలని..

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 దాటిందంటే సాయంత్రం 5:00 దాకా బయట తిరగాలంటే సెగలు పడుతున్నాయి. భూమ్మీద ఉండే మనుషులకే ఇంత అసౌకర్యంగా ఉందంటే.. ఇక సముద్రంలో బతికే చేపను బతికుండగా భూమి మీద పడేస్తే ఎంత విలవిలలాడుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దృశ్యమే ఈ వీడియోలో చూడొచ్చు. మనోడికి ఆ చేప ఎక్కడ దొరికిందో తెలియదు కానీ.. మనకే ఈ వేడికి గొంతు తడారిపోతుంటే.. పాపం ఈ చేప రాజానికి ఇంకెంత దాహంగా ఉంటుందో కదా అన్నట్లు.. ఫుల్ బీర్ ఒకటి తెచ్చి ఆ చేపకు ఫూటుగా ఎక్కిస్తున్నాడు. ఆ చేప కూడా ఒక్కో గుటుక గుటుక్కుమనిపిస్తూ అలా చూస్తుండగానే సగం సీసా బీరు స్వాహా చేసింది. అదేదో గనకార్యం చేస్తున్నట్టు.. అతను, అతని జతగాడు ఇంకొకడు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. వైరల్ అవుతుంది.


నీటిలో ఉన్న చేపని బయటకి తేవడం ఎందుకు? తెచ్చినా.. దాన్ని ఏ పులుసో వండుకు తినకుండా.. అలా మందు కొట్టించడం ఎందుకు? ఎలాగో కొన్ని నిమిషాలలో చనిపోయే చేపకి మదుపానీయం రుచి చూపించడం ఎందుకు? ఇది మాత్రం జంతు హింస కాదా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే... ఫిష్ విత్ కింగ్ ఫిషర్ అంటూ మరికొందరు సరదా కొటేషన్లు పెడుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు?


Read Also : హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుదలపై IRDAI కీలక నిర్ణయం

Supreme Court: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

CM Revanth Met PM Modi : సీఎంకు పెద్ద లిస్ట్ ఇచ్చిన పీఎం.. అందులో ఏముందంటే..

Updated Date - Feb 26 , 2025 | 06:36 PM