Chinese Restaurant Compensation: చైనాలో షాకింగ్ ఉదంతం.. నాలుగు వేల మంది కస్టమర్లకు రెస్టారెంట్ పరిహారం
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:08 PM
ఇద్దరు వ్యక్తులు చేసని పనికి అభాసుపాలపై ఓ చైనా రెస్టారెంట్ ఏకంగా 4 వేల మంది కస్టమర్లకు పరిహారం చెల్లించింది. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: చైనాలో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ భారీ పొరపాటు కారణంగా ఇబ్బంది పడ్డ సుమారు 4 వేల మంది కస్టమర్లకు చైనా రెస్టారెంట్ చెయిన్ హాయ్‌డిలావో యాజమాన్యం పరిహారం చెల్లించుకుంది. ప్రస్తుతం ఈ ఉదంతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా సంచలనానికి దారి తీసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, షాంఘాయ్‌లోని రెస్టారెంట్ చెయిన్‌కు చెందిన ఓ బ్రాంచ్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రైవేటు గదిలో విందు ఆరగించారు. ఆ సందర్భంగా వారు వంటగదిలో మరుగుతున్న సూప్‌లో మూత్ర విసర్జన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెను కలకలానికి దారి తీసింది.
సోషల్ మీడియాలో తల్లి ఫొటో చూసి షాక్.. పోస్టు పెట్టిన వారిని వాకబు చేస్తే..
దీంతో, సదరు సంస్థ ఇబ్బందుల్లో పడింది. అసలు ఘటన ఎక్కడ జరిగిందో తెలుకునేందుకు కూడా చాలా సమయం పట్టింది. సిబ్బందికి శిక్షణ లేమి, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్టు అంగీకరించింది. దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు పేర్కొంది.
అసలేం జరిగిందీ తెలుసుకున్నాక విచారం వ్యక్తం చేసిన సంస్థ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. ఈ ఘటనతో ప్రభావితమైన సుమారు 4 వేల మందికి పరిహారం చెల్లిస్తున్నట్టు పేర్కొంది. మరోసారి ఇలా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
Indian Talking Loudly At Airport: అస్సలు మర్యాద లేదు.. సాటి భారతీయుడిని తిట్టిపోసిన ఎన్నారై!
అయితే, కస్టమర్లకు ఎంత మొత్తం ఇచ్చిందీ మాత్రం వెల్లడించలేదు. ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. కోర్టులో న్యాయపోరాటం ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌లో ఇటీవల దాదాపు ఇలాంటి ఘటన వెలుగు చూసింది. పచారీ సామాన్లు షాపులో ఓ కంటెంట్ క్రియేటర్ మూత్ర విసర్జన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు కంటెంట్ క్రియేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Honesty in relationships: నిజాయితీగా ఉంటే బంధాలు బలపడతాయా.. సైకాలజిస్టులు ఏం తేల్చారంటే..