Viral Video: మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు.. తన బిడ్డకు జోలికి వస్తే ఎలా ఉంటుందంటే..
ABN , Publish Date - Feb 18 , 2025 | 08:21 PM
మొసలి బారి నుంచి తనను తాను కాపాడుకోలేని ఏనుగు తన బిడ్డకు ప్రమాదం వస్తే మాత్రం తన ప్రతాపం చూపిస్తుంది. అమితమైన ఆగ్రహంతో ఆ మొసలికి చుక్కలు చూపిస్తుంది. అది తల్లి ప్రేమకు ఉన్న గొప్పతనం. తల్లి తన బిడ్డకు ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాలను ఒడ్డి పోరాడుతుంది.

నీటిలోని మొసలి ఎంతో శక్తివంతమైనది. నీటిలోని మొసలికి చిక్కితే ఏనుగు కూడా సరెండర్ అయిపోవాల్సిందే. అయితే మొసలి బారి నుంచి తనను తాను కాపాడుకోలేని ఏనుగు (Elephant) తన బిడ్డకు ప్రమాదం వస్తే మాత్రం తన ప్రతాపం చూపిస్తుంది. అమితమైన ఆగ్రహంతో ఆ మొసలికి చుక్కలు చూపిస్తుంది. అది తల్లి (Mother) ప్రేమకు ఉన్న గొప్పతనం. తల్లి తన బిడ్డకు ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాలను ఒడ్డి పోరాడుతుంది. ఎంతటి బలవంతులనైనా ఎదురిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Viral Video).
ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద తన @susantananda3 ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ తల్లి ఏనుగు తన బిడ్డతో కలిసి అడవిలో ఉన్న ఓ నీటి కొలను దగ్గరకు వెళ్లింది. పిల్ల ఏనుగు (Baby Elephant) ఆ కొలనులో పడుక్కుంది. తల్లి ఏనుగు తన తొండంతో నీళ్లు తీసుకుని పైన వేసుకుంటుంది. ఇంతలో అక్కడకు మెల్లిగా ఓ మొసలి (Crocodile) వస్తోంది. ఆ మొసలి రాకను ముందుగా గమనించిన తల్లి ఏనుగు పరుగున వెళ్లి ఆ మొసలిపై దాడికి దిగింది. దానిని కాలితో తొక్కింది. తొండంతో నలిపేసింది. ఆ ఏనుగుతో పోరాడలేక మొసలి ఒడ్డు ఎక్కి వెళ్లిపోయింది (Elephant Videos).
అక్కడే కార్‌లో ఉన్న వ్యక్తులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు. 25 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``తల్లిని మించిన రక్షణ ఎవరికీ ఉండదు``, ``ఈ ఏనుగు ఎంత వేగంగా వెళ్లిందో చూడండి``, ``పాపం.. బేబీ ఎలిఫెంట్ బాగా భయపడిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: నా పాపాలే కాదు.. నా మొబైల్ పాపాలు కూడా పోవాలి.. కుంభమేళాలో ఓ కుర్రాడు ఏం చేశాడంటే..
Viral Video: ఛీ.. ఛీ.. పేద వాడిని కూడా వదలరా? రైల్లో ఈ ప్రయాణికుల తీరు చూస్తే కోపం రాకమానదు..
Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..