Washing Clothes in Space: అంతరిక్షంలో వ్యోమగాములు దుస్తులు ఉతుక్కుంటారా?
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:39 PM
అంతర్జిక్షంలో ఉండగా వ్యోమగాములు ఒక్కో దుస్తుల జతను రోజుల నుంచి వారాల పాటు వినియోగిస్తారట. ఆ తరువాత విడిచిన దుస్తులను తమ వెంట భూమికి తీసుకొస్తారట.

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు అంతరిక్ష యాత్రలంటే కొన్ని రోజుల పాటు సాగేవి. కానీ నేటి జమమానాలో వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏకంగా వారాలు నెలల పాటు గడుపుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఏ దుస్తులు వేసుకుంటారు? రోజూ దుస్తులు మార్చుకుంటారా? వాటిని ఉతుక్కుంటారా అనే సందేహాలు కలగకమానవు.
నిపుణులు చెప్పేదాని ప్రకారం, అంతరిక్షంలోని పరిస్థితుల కారణంగా దుస్తులు త్వరగా పాడవుతాయట. దీనికి పరిష్కారంగా వ్యోమగాములు తమ యాత్రకు కావాల్సినన్ని దుస్తులను వెంట తీసుకెళతారు. అంతరిక్షంలో ప్రతి నీటి చుక్కా అమూల్యమైనది. కాబట్టి నీటి పొదుపు అత్యవసరం. దీంతో, అంతరిక్షంలో దుస్తులను ఉతికే ప్రయత్నమే ఉండదని నిపుణులు చెబుతున్నారు (Viral).
Bill Gates: మనుషుల అవసరం అంతగా ఉండకపోవచ్చు.. ఏఐపై బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్య
వ్యోమగాములు సుదీర్ఘకాలంలో పాటు అంతరిక్షంలో ఉన్నా వారు దుస్తులను మాత్రం ఉతుక్కోరు. ఇందుకు బదులు విడిచిన దస్తులను వారు భూమ్మీదకు తిరిగొచ్చేటప్పుడు వెనక్కు తెచ్చేస్తారు. ఇక అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన వారి కోసం క్రమం తప్పకుండా కొత్త దుస్తుల సరఫరా జరుగుతుంటుందట.
ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు వ్యోమగాములు ఒకే జతను రోజులు లేదా వారాల తరబడి వాడతారు. అయితే, ఐఎస్ఎస్‌లో దుమ్ము అనేదే ఉండదు కాబట్టి దుస్తులు మాసిపోవడం ఉండదు. అయితే, వ్యోమగాములు తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు అంతరిక్షంలో క్రమం తప్పకుండా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా చెమటపట్టి దుస్తులు మురికిగా మారతాయి. అయితే, అంతర్జాతీయ అందరిక్ష కేంద్రంలో ఉష్ణోగ్రత ఎప్పుడు వ్యోమగాములకు అనువైన విధంగా నియంత్రిస్తారు. దీంతో, దుస్తులు తరచూ మార్చుకోవాల్సిన అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Infosys Layoffs: ఉద్యోగుల్ని బలవంతంగా తొలగిస్తున్నారంటూ వార్తలు.. వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్!
ఇక మాసిన దుస్తులను తిరిగి శుభ్రపరిచి పునర్వియోగించుకునేందుకు వాటిని భూమ్మీదకు చేరుస్తారు. కొన్ని సందర్భాల్లో అవి భూవాతావరణంలోకి వచ్చేటప్పుడు మండి మసి అయిపోయేలా చేస్తారు. అయితే, భవిష్యత్తులో స్పేస్ మిషన్లు మిక్కిలి సంఖ్యలో జరిగే అవకాశం ఉండటంతో దుస్తులు ఉతుక్కోవడానికి సంబంధించి శాశ్వత పరిష్కారంపై శాస్త్రవేత్తలు ఇప్పటికే దృష్టి పెట్టారు.
భూమ్మీద కంటే 50 శాతం తక్కువ నీటితో దుస్తులు ఉతికేందుకు ఉపయోగపడే ప్రత్యేక డిటర్జెంట్‌ను శాస్త్రవేత్తలు 2023లో కనుగొన్నారు. దీని పైరు టైడ్ ఇన్ఫినిటీ. అయితే, నానా దీన్ని ఇంకా వినియోగంలోకి తీసుకురాలేదు.