Share News

Viral Video: ఇంట్లోకి తలపెట్టి పలకరించిన సింహం

ABN , Publish Date - Apr 04 , 2025 | 06:29 PM

Lion Viral Video: సింహం అడవినుంచి నేరుగా కోవాయా అనే ఊర్లోకి వెళ్లింది. ఆహారం కోసం వెతుకుతూ ఓ ఇంట్లోకి తల పెట్టింది. చప్పుడు అవ్వటంతో ఇంట్లో వాళ్లు నిద్రలేచారు. అక్కడ సింహం తల కనిపించటంతో వారి గుండె జల్లు మంది.

Viral Video: ఇంట్లోకి తలపెట్టి పలకరించిన సింహం
Lion Trying To Enter Into House

గుజరాత్: సోషల్ మీడియాలో అగ్గిపెట్ట మచ్చకు సంబంధించిన ఓ డైలాగ్ చాలా ఫేమస్. దాన్ని ఎన్ని రకాలుగా అంటే .. అన్ని రకాలుగా వాడేస్తున్నారు. అదే ‘ అన్నా.. నేనన్నా.. కిరణ్ కుమారు’ అన్న డైలాగ్. ఆ డైలాగును క్రూర జంతువులకు కూడా వాడేస్తున్నారు. ఎక్కడైనా పులికానీ, ఏదైనా సింహం కానీ సెడెన్‌గా మనుషులకు ఎదురు పడితే.. అవి ఈ డైలాగు చెబుతున్నట్లు వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా, ఈ మీమ్ టెంప్లెట్‌కు సరిపోయే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ సింహం ఇంట్లోకి తల పెట్టి.. కుటుంసభ్యుల్ని పలకరించింది. ఓ నిమిషం పాటు అది తల బయటకు తీయకుండా లోపలకు చూస్తూనే ఉండిపోయింది.


ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్, అమ్రెల్లిలోని అడవినుంచి ఓ సింహం బయటకు వచ్చింది. నేరుగా దగ్గరలోని కోవాయా అనే ఊర్లోకి వెళ్లింది. ఆహారం కోసం వెతుకుతూ గుడిసెలాగా ఉండే ఇంట్లోకి తల పెట్టింది. ఆ సమయంలో ఇంట్లోని వారంతా ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. ఏదో శబ్ధం అవుతుండటంతో వారికి మెలుకువ వచ్చింది. అటువైపు చూశారు. అక్కడ సింహం తల కనిపించటంతో షాక్‌తో పాటు షేక్ కూడా అయ్యారు. భయంతో బిక్కచచ్చిపోయారు. ఆ సింహం బలవంతంగా ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అయినా దాని వల్ల కాలేదు. ఇంట్లోని వారంతా ప్రాణ భయంతో అల్లాడిపోయారు.


ఇంట్లో ఉండే ఓ వ్యక్తి దాన్నంతా వీడియో తీశాడు. కొద్దిసేపటి తర్వాత ఆ సింహం అక్కడినుంచి వెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం రోజున ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు .. సింహం తోకను .. పాము అనుకుని భ్రమపడుతున్నారు. ‘ మాకు సింహంతో పాటు పాము కూడా కనిపిస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Annamalai: బీజేపీ అధ్యక్షుడి రేసులో లేను.. అన్నామలై కీలక వ్యాఖ్యలు

బంపర్ ఆఫర్.. రూ.9కే చీర.. షాపు వాళ్ల దిమ్మతిరిగిపోయింది..

Updated Date - Apr 04 , 2025 | 06:29 PM