Share News

Tornado Funny Video: క్రికెట్ గ్రౌండ్‌లోకి చొచ్చుకొచ్చిన సుడిగాలి.. యువకుడు ఎదురుగా నిలబడడంతో.. చివరకు..

ABN , Publish Date - Apr 08 , 2025 | 09:45 AM

కొందరు యువకులు ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతుంటారు. అదే సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. సుడిగాలి పెద్ద ఎత్తున్న గింగిరాలు తిరుగుతూ గ్రౌండ్ వైపు దూసుకొస్తుంటుంది. దీంతో ఓ యువకుడు దానికి ఎదురుగా వచ్చి నిలబడతాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Tornado Funny Video: క్రికెట్ గ్రౌండ్‌లోకి చొచ్చుకొచ్చిన సుడిగాలి.. యువకుడు ఎదురుగా నిలబడడంతో.. చివరకు..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. బాధ, నవ్వు, కోపం.. ఇలా అనేక రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలను చూస్తుంటాం. కొన్ని వీడియోలు సినిమా సీన్లను తలదన్నేలా ఉంటాయి. మరికొన్ని వీడియో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుడిగాలి క్రికెట్ గ్రౌండ్‌లోకి దూసుకెళ్తుండగా.. సడన్‌గా ఓ యువకుడు ఎదురుగా నిలబడతాడు. చివరకు అతడి నిర్వాకంతో ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు ఖాళీ స్థలంలో (Youth Playing Cricket) క్రికెట్ ఆడుతుంటారు. అదే సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంటుంది. సుడిగాలి పెద్ద ఎత్తున్న గింగిరాలు తిరుగుతూ గ్రౌండ్ వైపు దూసుకొస్తుంటుంది. దీంతో దుమ్ము మొత్తం గాల్లోకి లేస్తుంది. ఆ సుడిగాలి మీద పడితే మొత్తం దుమ్ముకొట్టుకుపోయే పరిస్థితి.

Marriage Viral: నన్ను ముట్టుకోవద్దు.. మొదటి రోజు వధువు వింత కండీషన్.. తర్వాత జరిగిందేంటో తెలిస్తే..


సుడిగాలి సమీపానికి వస్తున్నా కూడా యువకులు మాత్రం తాపీగా క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోట చేసుకుంటుంది. ఓ యువకుడు పరుగెత్తుకుంటూ వెళ్లి సుడిగాలికి ఎదురుగా నిలబడగాడు. తర్వాత దానిపై కోపంతో.. ‘‘ఇక్కడి నుంచి వెళ్లిపోతావా.. చావగొట్టమంటావా’’.. అన్నట్లుగా రాయి తీసుకుని దానిపై విసిరికొడతాడు. అయితే అతను రాయి విసిరికొట్టగానే ఆశ్చర్యకరంగా (man chased away the tornado) సుడిగాలి అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇది చూసేందుకు.. యువకుడికి భయపడి సుడిగాలి పారిపోయినట్లుగా అనిపిస్తుంది.

Washing Machine Funny Video: వాషింగ్‌ మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చా.. ఈమె అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తెల్ల షర్ట్ యువకుడి చేతిలో ఏందో మంత్రం ఉన్నట్లుందే’’.. అంటూ కొందరు, ‘‘సుడిగాలినే వణికించేశాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 09:45 AM