Share News

King Cobra Viral Video: ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందే.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే..

ABN , Publish Date - Apr 06 , 2025 | 07:47 AM

ఓ వ్యక్తి కింగ్ కోబ్రా పాముకు ఎదురుగా వెళ్లి మోకాళ్లపై కూర్చుంటాడు. అంతటితో ఆగకుండా పాముకు అత్యంత సమీపంగా వెళ్తాడు. అంతటితో ఆగకుండా ఇతను చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందే’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు..

King Cobra Viral Video: ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందే.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే..

పాము అంటేనే ఒంట్లో భయం మొదలవుతుంది. అలాంటిది ఇక కింగ్ కోబ్రా అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఇక కళ్లెదురుగా కనిపిస్తే.. సమీపానికి వచ్చి పడగ విప్పితే.. ఊహించుకుంటేనే భయమేస్తోంది కదా. అయితే ఇలాంటి భయంకరమైన పాములతోనూ కొందరు ఫన్నీ గేమ్స్ ఆడుతుంటారు. మరికొందరు వాటిని చిన్న పిల్లలు చేసి ఆడుకుంటుంటారు. ఇలాంటి చిత్ర విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందేై’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కింగ్ కోబ్రా (King Cobra) పాముకు ఎదురుగా వెళ్లి మోకాళ్లపై కూర్చుంటాడు. అంతటితో ఆగకుండా పాముకు అత్యంత సమీపంగా వెళ్తాడు. అప్పటికీ ఆగకుండా ఏకంగా తన తలను పాము తలపై టచ్ చేస్తాడు.

Optical illusion: మీ కళ్లకు పెద్ద పరీక్ష.. ఈ అడవిలో దాక్కున్న జింకను 10 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగు లేనట్లే..


అలా చాలా సేపు అతను పాము తలపై (man put his head on king cobra) తలను పెట్టి మౌనంగా ఉడిపోతాడు. పాము కూడా ఎటూ కదలకుండా అలాగే సైలెంట్‌గా ఉంటుంది. ఆ తర్వాత తన చేతిని పాము తలపై పెట్టి నిమరాలని చూస్తాడు. అయితే పాము అతడి చేతిపై కాటేసేందుకు నోరు తెరుస్తుంది. అయినా అతను ఎంతో చాకచక్యంగా తన చేతిని పాము తలపై పెట్టేస్తాడు. ఇలా చాలా సేపు అతను ఈ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఆటలాడుకుంటాడు. ఇతను ఇలా చాలా రకాల పాములను పట్టుకుంటూ ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటాడు.

Cat Viral Video: తల్లిని మరిపించిన పిల్లి.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే’’.. అంటూ కొందరు, ‘‘పాములను మచ్చిక చేసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 41 లక్షలకు పైగా లైక్‌లు, 71 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 07:47 AM