Share News

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Apr 08 , 2025 | 08:59 AM

ఓ యువతి కొత్త స్కూటీ ముందు నిలబడి పూజ చేస్తుంటుంది. ఈ క్రమంలో స్కూటీ ఎదుట రోడ్డుపై టెంకాయ కొట్టాల్సి వస్తుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

ప్రస్తుత యువత ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటు పడిపోయింది. ఒక యువతుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైట్ పాటిస్తూ కొందరు.. పిజ్జాలు, బర్గర్లకు అలవాటు పడి ఇంకొందరు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ యువతి వీడియో చూసి అంతా ఈ మాటలను గుర్తు చేసుకుంటున్నారు. కొత్త స్కూటీ ముందు టెంకాయ కొట్టమంటే.. చివరకు ఆమె చేసిన పని అందరినీ తెగ నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (Young woman) కొత్త స్కూటీ ముందు నిలబడి పూజ చేస్తుంటుంది. ఈ క్రమంలో స్కూటీ ఎదుట రోడ్డుపై టెంకాయ కొట్టాల్సి వస్తుంది. టెంకాయ (coconut) చేతిలోకి తీసుకున్న యువతి.. దాన్ని కొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది.

Train Funny Video: ఈ ఫోన్ కొట్టేయడం అసాధ్యం.. రైల్లో ఇతడి జాగ్రత్తలు చూస్తే..


టెంకాయను చేతిలోకి తీసుకున్న యువతి.. తన శక్తినంతా కూడగట్టి ఫట్‌మని నేలకేసి కొడుతుంది. ఇలా కొట్టగానే టెంకాయకు ముక్కలు ముక్కలు కావాల్సింది పోయి.. అందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. అంత గట్టిగా కొట్టినా కూడా టెంకాయ పగలడం కాదు కదా.. బంతిలా పైకి లేచి ఎగురు కుంటూ దూరంగా ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా అవాక్కవుతుంది. టెంకాయ కొడితే పగలాల్సింది పోయి.. ఇలా అయిందేంటీ.. అని నవ్వుకుంటుంది.

Marriage Viral: నన్ను ముట్టుకోవద్దు.. మొదటి రోజు వధువు వింత కండీషన్.. తర్వాత జరిగిందేంటో తెలిస్తే..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి శక్తి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇక ఈమె డ్రైవింగ్ చేస్తే ఇంకెలా ఉంటుందో’’.. అంటూ మరికొందరు, ‘‘ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 3.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Washing Machine Funny Video: వాషింగ్‌ మెషిన్‌ను ఇలాక్కూడా వాడొచ్చా.. ఈమె అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2025 | 08:59 AM