Share News

Lion VS Wildebeest: వైల్డ్‌బీస్ట్‌పై సింహం దాడి.. చివరకు చుక్కలు కనిపించాయిగా..

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:02 AM

వేటకు బయలుదేరిన సింహానికి వైల్డ్‌బీస్ట్ కంటపడింది. దాన్ని చూడగానే సింహం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన టార్గెట్‌ను ఫిక్స్ చేసింది. ఎలాగైనా ఈ వైల్డ్‌ బీస్ట్‌ను చంపి తినేయాలని నిర్ణయించుకుంది. మెరుపువేగంతో దానిపై ఎటాక్ చేసింది. అయితే చివరకు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది..

Lion VS Wildebeest: వైల్డ్‌బీస్ట్‌పై సింహం దాడి.. చివరకు చుక్కలు కనిపించాయిగా..

సింహాల వేట ఎం భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అడవికి రాజైన సింహం ఒక్కసారి అడుగు బయటికి పెట్టిందంటే.. ఇక ఎలాంటి జంతువైనా దానికి ఆహారమైపోవాల్సిందే. దీంతో దాని జోలికి వెళ్లేందుకు ఏ జంతువూ సాహసించదు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న జంతువులు కూడా సింహాలకు చుక్కలు చూపిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సింహం వైల్డ్‌బీస్ట్‌పై దాడికి యత్నించింది. అయితే చివరకు సినిమా తరహా ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వైల్డ్‌బీస్ట్‌ దెబ్బ.. సింహం అబ్బా..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ పాత వీడియో (Viral Video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వేటకు బయలుదేరిన సింహానికి వైల్డ్‌బీస్ట్ కంటపడింది. దాన్ని చూడగానే సింహం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన టార్గెట్‌ను ఫిక్స్ చేసింది. ఎలాగైనా ఈ వైల్డ్‌ బీస్ట్‌ను చంపి తినేయాలని నిర్ణయించుకుంది. మెరుపువేగంతో దానిపై ఎటాక్ చేసింది.

Optical illusion: మీ కళ్లకు పెద్ద పరీక్ష.. ఈ అడవిలో దాక్కున్న జింకను 10 సెకన్లలో గుర్తిస్తే మీకు తిరుగు లేనట్లే..


సింహం దాడితో ఉలిక్కిపడిన వైల్డ్‌బీస్ట్.. ఎలాగైనా ప్రాణాలో బయటపడాలని తన శక్తిని మొత్తం కూడగట్టింది. మూతిని గట్టిగా పట్టుకున్న సింహాన్ని (Wildebeest attack on lion) తన కొమ్ములతో ఎత్తి పడేసింది. ఆ తర్వాత దాన్ని తరుముకుంటూ వెళ్లింది. వైల్డ్ బీస్ట్ దాడితో షాక్ అయిన సింహం.. ‘‘వామ్మో.. ఇదేంటీ ఇలా పొడుస్తోంది.. బతికుంటే బలుసాకు తినొచ్చు.. అని అనుకుంటూ అక్కడి నుంచి పరుగుందుకుంది. అయినా శాంతించని వైల్డ్‌బీస్ట్ .. సింహాన్ని తరుముకుంటూ వెళ్తుంది.

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..


ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహానికి చుక్కలు చూపించిన వైల్డ్‌బీస్ట్’’.. అంటూ కొందరు, ‘‘అన్ని రోజులు మనవే కావంటే ఇదేనమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

King Cobra Viral Video: ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందే.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే..


ఇవి కూడా చదవండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 11:04 AM