Marriage Viral: నన్ను ముట్టుకోవద్దు.. మొదటి రోజు వధువు వింత కండీషన్.. తర్వాత జరిగిందేంటో తెలిస్తే..
ABN , Publish Date - Apr 06 , 2025 | 11:59 AM
పెళ్లి జరిగిన తర్వాత కూడా అనేక కారణాలతో దంపతులు విడాకుల వరకూ వెళ్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. శోభనం గదిలో వరుడికి ఓ వధువు వింత కండీషన్ పెట్టింది. వివరాల్లోకి వెళితే..

మూడు ముళ్ల బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టే జంట.. జీవితాంతం అదే బంధాన్ని కొనసాగిస్తారు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. కొన్నసార్లు తాళి కట్టే వరకూ పెళ్లి సవ్యంగా జరుగుతుందన్న నమ్మకం ఉండదు. ఇంకొన్నిసార్లు పెళ్లి జరిగిన తర్వాత కూడా అనేక కారణాలతో దంపతులు విడాకుల వరకూ వెళ్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. శోభనం గదిలో వరుడికి ఓ వధువు వింత కండీషన్ పెట్టింది. ‘‘నన్ను ముట్టుకోవద్దు.. ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతా’’.. అంటూ బెదిరించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బరేలీ జిల్లా బారాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి, ఇదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది జనవరిలో వీరికి బంధువుల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం (Marriage) చేశారు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. శోభనం రోజు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Lion VS Wildebeest: వైల్డ్‌బీస్ట్‌పై సింహం దాడి.. చివరకు చుక్కలు కనిపించాయిగా..
మొదటి రోజు రాత్రి ఎంతో సంతోషంతో వధువుకు (Bride) వద్దకు వెళ్లిన వరుడికి (Groom) విచిత్ర అనుభవం ఎదురైంది. ‘‘నన్ను ముట్టుకోవద్దు.. బలవంతంగా ముట్టుకున్నావంటే.. విషం తాగి చచ్చిపోతా’’.. అంటూ వధువు బెదిరించింది. ఆమె మాటలతో షాక్ అయిన వరుడు.. నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పినా కూడా ఆమె వినిపించుకోలేదు. చివరకు కారణం చెప్పమని ఆమెను పదే పదే అడగ్గా.. అసలు విషయం చెప్పేసింది. ‘‘నేను పెళ్లికి ముందు ఓ యువకుడిని ప్రేమించాను, ఇప్పటికీ అతన్నే ప్రేమిస్తున్నాను.. నా భర్తగా అతడికి ఒక్కడే అర్హత ఉంది’’.. అని చెప్పడంతో వరుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..
చివరకు ఈ విషయం వరుడు కుటుంబ సభ్యుల వరకూ వెళ్లింది. బంధువులంతా నచ్చజెప్పినా ఆమె మాత్రం వినిపించుకోలేదు. తమ కూతురుకు నచ్చజెప్పి పంపించాల్సిన తల్లిదండ్రులు కూడా ఆమెకే మద్దతు పలికారు. తమ కూతురు జోలికి వస్తే కేసులు పెడతామంటూ బెదిరించసాగారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన భార్య కాపురానికి రాకపోవడంతో చివరకు చేసేదేమీలేక.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో వధువుతో పాటూ మరో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
King Cobra Viral Video: ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్‌లో ఉన్నట్టుందే.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే..
ఇవి కూడా చదవండి..
Crow viral video: మాట్లాడే కాకిని ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Stunt Viral Video: బాహుబలికి పెద్దనాన్నలా ఉన్నాడే.. దారిలో కారు అడ్డుగా ఉందని..