Birds: కాలికి కడియంతో వస్తున్న వలస పక్షులు..
ABN , Publish Date - Feb 22 , 2025 | 07:29 AM
దిండుగల్ జిల్లా కొడైకెనాల్‌లో వారం రోజులుగా విదేశీ పక్షుల(Foreign birds) రాక అధికమైంది. వన్యప్రేమికులు కాలికి కట్టిన కడియాలతో ఈ విదేశీ పక్షులు ఆ ప్రాంతంలో వాలుతున్నాయి.

చెన్నై: దిండుగల్ జిల్లా కొడైకెనాల్‌లో వారం రోజులుగా విదేశీ పక్షుల(Foreign birds) రాక అధికమైంది. వన్యప్రేమికులు కాలికి కట్టిన కడియాలతో ఈ విదేశీ పక్షులు ఆ ప్రాంతంలో వాలుతున్నాయి. వివిధ దేశాలకు వలస వెళ్లే పక్షులు ఏ దిశగా ఏయే ప్రాంతాలకు వెళుతున్నాయనే విషయం తెలుసుకునేందుకు పక్షి ప్రేమికులు వాటి కాళ్లకు కడియాలు కడుతుంటారు. ఆ కడియాలపై ఆ పక్షుల స్వస్థలం వివరాలుంటాయి.
ఈ వార్తను కూడా చదవండి: BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ఆ కడియాల ద్వారానే ఆ పక్షులు వలస వెళ్ళిన ప్రాంతాల వివరాలను పక్షుల ప్రేమికులు సేకరిస్తున్నారు. ప్రతియేటా కొడైకెనాల్(Kodaikanal)లో వేసవి ప్రారంభానికి ముందే వివిధ రకాల రంగురంగుల పక్షులు వస్తుంటాయి. ప్రస్తుతం కాలికి కడియాలున్న విదేశీ విహంగాలు వందల సంఖ్యలో కొడైకెనాల్ పర్వతశ్రేణుల్లో వాలుతున్నాయి. ఆ పాంతం అంతటా పర్యాటకులకు రమ్యమైన వాతావరణమే కనిపిస్తోంది.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News