Share News

Viral Video: మగాళ్లకు భద్రత లేదా.. అలా కొడితే చచ్చిపోతాడు తల్లీ..

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:29 PM

Viral Video: కాలం మారిపోయింది. జంబలకడి పంబ మొదటి దశ వచ్చేసింది. మగాళ్లను టార్చర్ చేస్తున్న ఆడవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. తాజాగా, ఓ భార్య తను భర్తను దారుణంగా చితక్కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: మగాళ్లకు భద్రత లేదా.. అలా కొడితే చచ్చిపోతాడు తల్లీ..
Panna Woman

మధ్యప్రదేశ్: జంబలకడి పంబ సినిమాలో ఆడవాళ్లు మగవాళ్లుగా.. మగవాళ్లు ఆడవాళ్లుగా మారిపోతారు. మొదటి దశలో లక్షణాలు మారుతాయి.. తర్వాత రూపాలు కూడా మారిపోతాయి. సమాజంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను చూసుకుంటే.. జంబలకడి పంబలోని మొదటి దశ వచ్చేసినట్లు కనిపిస్తోంది. స్త్రీ, పురుషుల లక్షణాలు కొద్ది కొద్దిగా మారుతూ ఉన్నాయి. భార్యలను హింసించే మగాళ్ల సంఖ్య తగ్గుతోంది. భర్తలను చంపుకుతింటున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, మధ్య ప్రదేశ్‌లొ సగటు మగాడు భయపడిపోయే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను అత్యంత రాక్షసంగా చితక్కొట్టింది. గొడ్డును బాదినట్లు భర్తను బాదింది.


సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్లోని పన్నాకు చెందిన లోకేష్‌కు అదే ప్రాంతానికి చెందిన హర్షితతో 2023లో పెళ్లయింది. హర్షిత పేద కుటుంబానికి చెందిన అమ్మాయి కావటంతో.. అతడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. బంగారం, డబ్బు కావాలంటూ భార్య, అత్త, బావమరిది లోకేష్‌ను చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశారు. శారీరకంగా, మానసికంగా అతడ్ని వేధించేవారు. రోజు రోజుకు వారి టార్చర్ పెరుగుతూ పోయింది. దీంతో లోకేష్ ఓ ప్లాన్ వేశాడు. వారికి తెలియకుండా గదిలో సీక్రెట్ కెమెరా అమర్చాడు.


కొద్దిరోజుల క్రితం భార్య అతడితో గొడవ పెట్టుకుంది. లోకేష్‌ను కింద కూర్చోబెట్టి అతడి రెండు చెంపలు వాయించింది. దెబ్బలు భరించలేక అతడు చేతులెత్తి వారిని ప్రథేయపడ్డాడు. అయినా ఆమె కనికరించలేదు. ఈసారి అతడి మీద కూర్చుని చెంపలు వాయించింది. ముఖంపై కాలితో బలంగా తన్నింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. అతడు ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. భార్య తనను చిత్ర హింసలు పెడుతోందని, పోలీసులు తనను కాపాడాలని వేడుకున్నాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు ఉన్నతాధికారులు ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Yashasvi Jaiswal: ముంబై జట్టుకు గుడ్ బాయ్ చెప్పిన యశస్వి జైస్వాల్..అసలేమైంది..

Banking Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 7 ప్రధాన బ్యాంకింగ్ రూల్స్

Updated Date - Apr 02 , 2025 | 04:29 PM