Share News

New Captain: అక్షర్‌కు ‘ఢిల్లీ’ పగ్గాలు

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:31 AM

ఐపీఎల్‌ మరో వారం రోజుల్లో ఆరంభం కానుండగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.

 New Captain: అక్షర్‌కు ‘ఢిల్లీ’ పగ్గాలు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ మరో వారం రోజుల్లో ఆరంభం కానుండగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు డీసీ పేర్కొంది. ఇన్నాళ్లూ డీసీ కెప్టెన్‌గా ఉన్న రిషభ్‌ పంత్‌ లఖ్‌నవూకు మారడంతో నూతన సారథి నియామకం అనివార్యమైంది. ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా ఎంపికవడం సంతోషాన్నిస్తోందని, జట్టును ముందుకు నడిపించేందుకు ఎదురుచూస్తున్నట్టు అక్షర్‌ చెప్పాడు.


వేలానికి ముందే అక్షర్‌ను డీసీ జట్టు రూ.16.5 కోట్లకు అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక 2019 నుంచి క్యాపిటల్స్‌ తరఫున అక్షర్‌ 82 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 150 లీగ్‌ మ్యాచ్‌ల్లో అతను 1653 పరుగులు సాధించి, 123 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - Mar 15 , 2025 | 01:32 AM