SRH vs RR Live Score: 13 కోట్ల ఆటగాడి చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:55 PM
IPL 2025: ఎంతో నమ్మి.. ఏకంగా రూ.13 కోట్లు ఖర్చు పెట్టి ఓ ప్లేయర్‌ను కొనుక్కుంది రాజస్థాన్ రాయల్స్. కానీ ఏం లాభం.. అతడు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు నమోదైంది. రూ.12.5 కోట్లు పెట్టి రాజస్థాన్ ఎంతో నమ్మకంతో తెచ్చుకున్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఒక వరస్ట్ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఆర్చర్.. ఏకంగా 76 పరుగులు ఇచ్చుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్పెల్‌గా ఇది నిలిచింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక స్పెల్‌లో ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు. పైగా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్ కూడా అతడ్ని ఉతికి ఆరేశాడు. ఆర్చర్ వేసిన ఒక ఓవర్‌లో హెడ్ అయితే ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు.
బౌలర్ల హాఫ్ సెంచరీ
ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న ఆర్చర్.. కేవలం ఒకే ఒక డాట్ బాల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో బ్యాటర్లు ఏమాత్రం భయపడకుండా పిచ్చకొట్టుడు కొట్టారు. దీంతో రాజస్థాన్ ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ బిక్కమొహం వేశారు. ఆర్చరే కాదు.. ఇతర రాయల్స్ బౌలర్లూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫజల్‌హక్ ఫరూకీ 3 ఓవర్లలో 49 పరుగులు, మహేశ్ తీక్షణ 4 ఓవర్లలో 52 పరుగులు, సందీప్ శర్మ 4 ఓవర్లలో 51 పరుగులు, తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చుకున్నారు. తుషార్ తప్ప మిగతా బ్యాటర్లంతా బౌలింగ్‌లో హాఫ్ సెంచరీ కొట్టేశారు. అందుకే ఆ జట్టు ముందు కొండంత స్కోరు నిలబడింది.
ఇవీ చదవండి:
కావ్యా పాప నవ్వు కోసమైనా కప్పు కొట్టాల్సిందే
హెడ్ ఊచకోత.. బౌలర్లకు నిద్రలేకుండా చేశాడు
కోహ్లిని రింకూ సింగ్ అవమానించాడా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి