Share News

SRH vs RR: హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోత.. పది ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ విధ్వంసం ఎలా సాగిందంటే..

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:41 PM

హైదరాబాద్ ఓపెనర్లు అద్భుత ఆరంభాన్ని అందించారు. గతేడాది మెరుపులను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 67) రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మూడు సిక్స్‌లు, 9 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించాడు.

SRH vs RR: హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోత.. పది ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ విధ్వంసం ఎలా సాగిందంటే..
Travis Head

ఊహించినట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అద్భుత ఆరంభాన్ని అందించారు. గతేడాది మెరుపులను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 67) రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మూడు సిక్స్‌లు, 9 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (11 బంతుల్లో 24) ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. తీక్షణ బౌలింగ్‌లో అభిషేక్ అవుటైనా హైదరాబాద్ పరుగుల ప్రవాహం ఆగలేదు.


వచ్చిన బ్యాటర్లందరూ బంతిని కసితీరా బలంగా బాదడమే తమ లక్ష్యం అన్నట్టుగా ఆడుతున్నారు. ఉన్నంతసేపు అద్భుతమైన వినోదాన్ని పంచిన హెడ్‌ను దేశ్‌పాండే పెవిలియన్ చేర్చాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (20 బంతుల్లో 36 బ్యాటింగ్) కూడా రెచ్చిపోతున్నాడు. అతడికి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తోడయ్యాడు. ప్రస్తుతం నితీష్ 8 బంతుల్లో 17 పరుగులతో ఆడుతున్నాడు. దీంతో హైదరాబాద్ 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇంకా అరవీర భయంకర హెన్రిచ్ క్లాసిన్ బ్యాటింగ్‌కు దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్కోరు 250 పరుగులు దాటేలా కనిపిస్తోంది.


కాగా, రాజస్థాన్ రాయల్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సంజూ శాంసన్ పూర్తి ఆరోగ్యంగా లేకపోవడంతో రియాన్ పరాగ్ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. సంజూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగబోతున్నాడు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli - Rinku Singh: కోహ్లిని రింకూ సింగ్ అవమానించాడా.. వేదిక మీద షేక్ హ్యండ్ ఇవ్వకపోవడంతో చర్చ


MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 04:41 PM