SRH vs RR: ఇషాన్ కిషన్ మెరపు శతకం.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:28 PM
ఊహించినట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంతిని కసితీరా బలంగా బాదడమే తమ లక్ష్యం అన్నట్టుగా ఆడారు. ఉప్పల్ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో రాజస్తాన్ ముందు హైదరాబాద్ టీమ్ భారీ లక్ష్యం ఉంచింది.

ఊహించినట్టుగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బంతిని కసితీరా బలంగా బాదడమే తమ లక్ష్యం అన్నట్టుగా ఆడారు. ఉప్పల్ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 106) మెరపు శతకంతో తన సత్తా చాటాడు. ఐపీఎల్‌లో తొలి సెంచరీ చేశాడు. ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 3 సిక్స్‌లు, 9 ఫోర్లతో 67) అద్బుత ఆరంభాన్ని అందించాడు.
వీరికి అభిషేక్ శర్మ (11 బంతుల్లో 24), నితీష్ రెడ్డి (15 బంతుల్లో 30) కూడా జత కలవడంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల ప్రవాహం నమోదైంది. నితీష్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసీన్ (14 బంతుల్లో 34) కూడా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. అందరూ సమష్టిగా రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అందరూ ఓవర్‌కు దాదాపు 10 పరుగులు ఇచ్చారు. దేశ్‌పాండే మూడు వికెట్లు తీశాడు. తీక్షణ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. సందీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. సందీప్, దేశ్‌పాండే ఒక్కో వికెట్ తీశారు. జోఫ్రా ఆర్చర్ ఓవర్‌కు దాదాపు 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
కాగా, రాజస్థాన్ రాయల్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. సంజూ శాంసన్ పూర్తి ఆరోగ్యంగా లేకపోవడంతో రియాన్ పరాగ్ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. సంజూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ప్యాట్ కమిన్స్, షమీ వంటి బౌలర్లను ఎదుర్కొని ఇంత స్కోరును ఛేజింగ్ చేయడం ఆర్‌ఆర్‌కు కాస్త కష్టమైన టాస్కే.
ఇవి కూడా చదవండి..
SRH vs RR: హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోత.. పది ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ విధ్వంసం ఎలా సాగిందంటే..
MS Dhoni: నేను వీల్‌ఛైర్‌లో ఉన్నా.. సీఎస్కే వాళ్లు లాక్కెళ్తారు: ఎంఎస్ ధోనీ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..