Share News

India vs England: భారమంతా బ్యాటర్లపైనే.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

ABN , Publish Date - Jan 28 , 2025 | 08:47 PM

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. టీమిండియా ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.

India vs England: భారమంతా బ్యాటర్లపైనే.. టీమిండియా టార్గెట్ ఎంతంటే
England vs India T20

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లలో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. టీమిండియా ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశాడు. 24 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.


ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ బెన్ డకెట్ (51) అర్ధ శతకంతో రాణించగా, మరో బ్యాటర్ లివింగ్‌స్టన్ (43) విలువైన పరుగులు చేశాడు. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌నకు విశ్రాంతిని ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు కల్పించింది.


కాగా, సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలి. రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. స్పిన్నర్లకే కాస్త సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిడింయా ఛేజింగ్ ఎలా సాగుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 28 , 2025 | 09:04 PM