Sourav Ganguly in Khakee: ఖాకీ సిరీస్‌లో గంగూలీ.. టీజర్‌లో షాకిచ్చిన బెంగాల్ టైగర్.. అసలు కథేంటంటే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:39 PM
ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ సిరీస్ ప్రోమోను తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఆ ప్రోమోలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పోలీస్ డ్రెస్‌లో కనిపించడం సంచలనంగా మారింది. ఈ సిరీస్‌లో గంగూలీ అతిథి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు మొదలయ్యాయి. ఎట్టకేలకు గంగూలీ యాక్టింగ్‌పై క్లారిటీ వచ్చింది.

కొన్నేళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైన ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ వెబ్ సిరీస్ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని అందించింది. దానికి కొనసాగింపుగా మార్చి 20వ తేదీన ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ (Khakee: The Bengal Chapter) విడుదల కాబోతోంది. ఈ సిరీస్‌లో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అతిథి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు మొదలయ్యాయి. ఆ సిరీస్ ప్రోమోను తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఆ ప్రోమోలో గంగూలీ పోలీస్ డ్రెస్‌లో కనిపించాడు. అలాగే గంగూలీ యాక్టింగ్ వార్తలకు కూడా ఈ ప్రోమోతో క్లారిటీ వచ్చింది (Sourav Ganguly in Khakee).
ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ విడుదల తేదీకి సంబంధించిన ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసింది. ఆ వీడియాలో గంగూలీ పోలీస్ డ్రెస్‌లో కనిపించాడు. గంగూలీ దగ్గరకు వెళ్లిన డైరెక్టర్.. హీరో చేయాల్సిన పనులన్నింటినీ వివరించాడు. వాటిని విన్న గంగూలీ.. ఇవన్నీ చేయడం తన వల్ల కాదని తేల్చి చెప్పాడు. అయితే మీరు మార్కెటింగ్ చేయండి అని గంగూలీని డైరెక్టర్ అడిగాడు. దానికి గంగూలీ ఓకే చెప్పాడు. దీంతో గంగూలీ యాక్టింగ్‌పై క్లారిటీ వచ్చింది. ఈ సిరీస్ పబ్లిసిటీలో మాత్రమే గంగూలీ భాగం అయ్యాడని అందరికీ స్పష్టత వచ్చింది.
కాగా, గంగూలీ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. గంగూలీ బయోపిక్ కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు ఈ బయోపిక్‌లో గంగూలీ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో గంగూలీ క్రికెట్ జీవితం, వ్యక్తిగత జీవితంతో పాటు బెంగాల్ రాజకీయాలను కూడా టచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
Virat Kohli On BCCI: తలతిక్క రూల్స్ అవసరమా.. బీసీసీఐపై కోహ్లీ సీరియస్
Australian Grand Prix 2025: ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో సంచలనం.. వరల్డ్ చాంపియన్‌కు షాక్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..