IPL 2025, GT vs MI: టాస్ గెలిచిన ముంబై.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:09 PM
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటములు చవి చూసిన గుజరాత్, ముంబై టీమ్‌లు ఈ రోజు తొలి విజయం అందుకునేందుకు తహతహలాడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది.

ఐపీఎల్ (IPL 2025)లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటములు చవి చూసిన గుజరాత్, ముంబై టీమ్‌లు (GT vs MI) ఈ రోజు తొలి విజయం అందుకునేందుకు తహతహలాడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు టాప్ క్లాస్ ప్లేయర్స్‌తో బరిలోకి దిగుతున్నాయి.
టాస్ గెలిచిన ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టీమ్ మొదట బ్యాటింగ్‌కు దిగబోతోంది. గత ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సీజన్‌లో జరిగిన ముంబై తొలి మ్యాచ్‌లో హార్దిక్ బరిలోకి దిగలేదు. ఈ సీజన్‌లో హార్దిక్‌కు ఇదే తొలి మ్యాచ్.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్‌టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ ఛాహర్, ట్రెంట్ బౌల్ట్, రెహమాన్, సత్యనారాయణ రాజు
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ