Share News

Rohit Sharma Injury: నెట్స్‌లో రోహిత్‌కు గాయం

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:27 AM

ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నెట్స్‌లో సాధన చేస్తుండగా మోకాలికి గాయమవడం వల్ల లఖ్‌నవూతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. 2021 తర్వాత ఇదే తొలిసారి ఐపీఎల్‌లో రోహిత్‌ ఒక మ్యాచ్‌కు దూరమవడం జరిగింది

 Rohit Sharma Injury: నెట్స్‌లో రోహిత్‌కు గాయం

లఖ్‌నవూ: నెట్స్‌లో సాధన చేస్తుండగా మోకాలికి గాయమవడంతో ముంబై ఇండియన్స్‌ ఓపెనర్‌, మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లఖ్‌నవూతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. శుక్రవారం నెట్స్‌లో సాధన చేస్తుండగా రోహిత్‌ మోకాలికి గాయమైందని, అతడు బరిలోకి దిగడం లేదని టాస్‌ అనంతరం హార్దిక్‌ తెలిపాడు. కాగా, ఐపీఎల్‌లో రోహిత్‌ ఓ మ్యాచ్‌కు దూరమవడం 2021 తర్వాత ఇదే తొలిసారి. ఇక, ముంబై ఇండియన్స్‌ తరఫున 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌ బరిలోకి దిగిన సందర్భంగా సూర్యకుమార్‌కు జట్టు యాజమాన్యం ప్రత్యేక జెర్సీని బహూకరించింది.

ఇవీ చదవండి:

ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు

రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్

ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2025 | 03:46 AM