IPL 2025, KKR vs SRH: కోల్‌కతా ఘనవిజయం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి
ABN , Publish Date - Apr 03 , 2025 | 10:59 PM
స్వంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో కూడా కోల్‌కతా బ్యాటర్లు, బౌలర్లు చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తమ హవాను కొనసాగించారు. ఏకంగా 70 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో పరాజయం. కోల్‌కతాకు ఈ సీజన్‌లో ఇది రెండో గెలుపు.

స్వంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో కూడా కోల్‌కతా బ్యాటర్లు, బౌలర్లు చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తమ హవాను కొనసాగించారు. ఏకంగా 70 పరుగుల తేడాతో విజయం సాధించారు. ముందు బ్యాటింగ్‌లో వెంకటేష్ అయ్యర్ (29 బంతుల్లో 3 సిక్స్‌లు, 7 ఫోర్లతో 60), రఘవంశీ (50) తర్వాత వైభవ్ అరోరా (3/29) రాణించడంతో కోల్‌కతా సునాయాస విజయం సాధించింది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది వరుసగా మూడో పరాజయం. కోల్‌కతాకు ఈ సీజన్‌లో ఇది రెండో గెలుపు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. డికాక్ (1)ను ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్ (7)ను మహ్మద్ షమీ పెవిలియన్‌కు చేర్చాడు. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్‌కతాను రహానే, రఘవంశీ ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఆ తర్వాత వెంట వెంటనే వీరిద్దరూ అవుటైపోయారు. ఆ దశలో క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ (60), రింకూ సింగ్ (32) వేగంగా బ్యాటింగ్ చేసి కీలకమైన పరుగులు చేశారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, షమీ, అన్సారీ, మెండిస్, హర్షల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఛేజంగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఈ భారీ ఛేజింగ్‌లో కీలకమైన ట్రావిస్ హెడ్ (4)ను వైభవ్ అరోరా తొలి ఓవర్లనే అవుట్ చేశాడు. ఆ వెంటనే అభిషేక్ శర్మ (2), ఇషాన్ కిషన్ (2) కూడా పెవిలియన్ చేరారు. కొద్దిసేపు క్రీజులో ఉన్న నితీష్ (19), మెండిస్ (27) మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మర్చలేకపోయారు. అనికేత్ వర్మ (6) కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. క్లాసెన్ (33) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యాడు. దీంతో హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ మూడేసి వికెట్లు తీశారు. రసెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..