ఆసియా క్రికెట్ చైర్మన్‌గా నఖ్వీ
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:11 AM
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కొత్త చైర్మన్‌గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహిసిన్ నఖ్వీ ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ చీఫ్...

న్యూఢిల్లీ: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కొత్త చైర్మన్‌గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహిసిన్ నఖ్వీ ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ చీఫ్ షమ్మి సిల్వ స్థానంలో నఖ్వీ బాధ్యతలు చేపట్టనున్నాడు. రొటేషన్ విధానంలో ఈసారి అవకాశం పాక్‌కు దక్కింది. గురువారం జరిగిన వార్షిక సర్వసభ్య భేటీలో ఏసీసీ చైర్మన్‌గా మొహిసిన్‌ను ఖరారు చేశారు. రెండేళ్లపాటు అతడు ఈ పదవిలో ఉంటాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..