రాణించిన నీషమ్, సీఫెర్ట్
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:13 AM
పేసర్ జేమ్స్ నీషమ్ (5/22) ఐదు వికెట్లతో, ఓపెనర్ సీఫెర్ట్ (38 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 97 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరవడంతో చివరి టీ20లో న్యూజిలాండ్ 8 వికెట్లతో పాకిస్థాన్‌ను...

చివరి టీ20లో పాక్ పరాజయం
వెల్లింగ్టన్ : పేసర్ జేమ్స్ నీషమ్ (5/22) ఐదు వికెట్లతో, ఓపెనర్ సీఫెర్ట్ (38 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లతో 97 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరవడంతో చివరి టీ20లో న్యూజిలాండ్ 8 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సను 4-1తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో..నీషమ్ ధాటికి తొలుత పాకిస్థాన్ 20 ఓవర్లలో 128/9 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ సల్మాన్ ఆఘా (51), షాదాబ్ ఖాన్ (28) మాత్రమే రాణించారు. డఫీ (2/18) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో సీఫెర్ట్ సునామీ ఇన్నింగ్స్‌తో కేవలం 10 ఓవర్లలోనే 131/2 స్కోరు చేసి న్యూజిలాండ్ నెగ్గింది.
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..