Share News

PM Modi: రూ.33,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 06:13 PM

ఛత్తీస్‌గఢ్‌లో 3 లక్షల మందికి పేద ప్రజలకు కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.

PM Modi: రూ.33,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ

రాయపూర్: ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లో రూ.33,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు. విద్యుత్, చమురు-సహజవాయువు, రైల్వేస్, రోడ్లు వంటి కీలక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. బిలాస్‌పూర్‌లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు దక్కేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో 3 లక్షల మందికి పేద ప్రజలకు కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. నవరాత్రి తొలిరోజునే బిలాసపూర్‌లో వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

PM Modi: ఆధునిక 'అక్షయ వటవృక్షం' ఆర్ఎస్ఎస్: ప్రధాని మోదీ


''నవరాత్రుల తొలిరోజు .ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాతా మహామాయి సొంత గడ్డ ఇది. కౌసల్యా దేవి పుట్టినిల్లు కూడా ఇదే. శక్తిమాతను ఆరాధించే ఈ తొమ్మిది రోజులు ఛత్తీస్‌గఢ్ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఈ శుభతరుణంలో ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది'' అని మోదీ అన్నారు. కొద్ది నిమిషాల క్రితమే రూ.33,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు మొదలయ్యాయని, వీటిలో పేదలకు ఇళ్లు, స్కూళ్లు, రోడ్లు, రైల్వేలు, విద్యుత్, గ్యాస్ పైప్‌లైన్స్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ఉద్దేశించినవని, ఈ గణనీయమైన అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని అన్నారు.


ఛత్తీస్‌గఢ్ సిల్వర్ జూబ్లీ ఇయర్

ఛత్తీస్‌గఢ్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న 'సిల్వర్ జూబ్లీ ఇయర్' ఇదని మోదీ అన్నారు. ఈ ఏడాదే అటల్ బిహారీ వాజ్‌పేయి శతాబ్ది సంవత్సరం కూడా అని గుర్తుచేసుకున్నారు. 2000లో వాజ్‌పేయి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి..

Amit Shah: జంగిల్‌రాజ్ కావాలో డవలప్‌మెంట్ అవసరమో తేల్చుకోండి... షా పిలుపు

Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్

Yatnal: కాంగ్రెస్‌, జేడీఎస్‏లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా

For National News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 06:13 PM