Aniket Verma: ఎవరీ అనికేత్ వర్మ.. ఎస్‌ఆర్‌హెచ్‌ను ఆదుకున్న ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ గురించి ఈ విషయాలు తెలుసా
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:59 PM
విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసింది. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓ కుర్ర బ్యాటర్ ఆదుకున్నాడు. భారీ సిక్సులతో హడలెత్తించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఆ కుర్ర బ్యాటర్ పేరు అనికేత్ వర్మ.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్న సన్‌రైజర్స హైదరాబాద్ టీమ్ (SRH) నుంచి మరో కొత్త హీరో పుట్టుకొచ్చాడు. అనుభవజ్ఞులైన ఆ స్టార్లు విఫలమైన చోట ఓ కుర్ర బ్యాటర్ మెరిశాడు. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (SRH vs DC) సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ముగిసింది. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓ కుర్ర బ్యాటర్ ఆదుకున్నాడు. భారీ సిక్సులతో హడలెత్తించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఆ కుర్ర బ్యాటర్ పేరు అనికేత్ వర్మ (Aniket Verma).
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన అనికేత్ తన కెరీర్‌లో ఎక్కువ మ్యాచ్‌లు మధ్యప్రదేశ్ తరఫున ఆడాడు. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతంగా ఆడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. భోపాల్ లియోపోర్డ్స్ తరఫున ఆరు మ్యాచ్‌ల్లో 273 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్‌లో 41 బంతుల్లో ఏకంగా 123 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టి అనికేత్‌పై పడింది. అనికేత్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. అవకాశం వచ్చినప్పుడు చెలరేగి తన సత్తా చాటాడు.
తాజా మ్యాచ్‌లో 41 బంతులు ఆడిన అనికేత్ 5 ఫోర్లు, 6 సిక్సులతో 74 పరుగులు చేశాడు. 180 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అనికేత్.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి టాప్ బౌలర్లను కూడా వదిలిపెట్టలేదు. బౌండరీలు బాదడం మాత్రమే కాకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అనుభవజ్ఞుడైన బ్యాటర్‌లా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. లేకపోతే హైదరాబాద్ టీమ్‌కు ఆ మాత్రం స్కోరు కూడా వచ్చేది కాదేమో.
ఇవి కూడా చదవండి..
IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్
IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..