Low Investment High Profit: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలిచ్చే బిజినెస్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..
ABN , Publish Date - Mar 30 , 2025 | 06:48 PM
అతి తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు కళ్ల చూడాలని కోరుకునే వారు హస్తకళల ఉత్పత్తులపై దృష్టిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కాలేజీ విద్యార్థులు, గృహిణులకు అత్యంత అనుకూలమని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: డబ్బు సంపాదించాలంటే వ్యాపారానికి మించిన మార్గం లేదు. అయితే, ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. కాబట్టి, వ్యాపారంలోకి దిగేముందు సరైన ప్రణాళిక వేసుకోవాలి. వ్యాపారంలో విజయానికి సరైన ప్రణాళిక, మార్కెట్‌పై అవగాహన అత్యంత ముఖ్యం.
వ్యాపారంలో లాభా నష్టాలకు ఉన్న అవకాశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం నిపుణులు సాయం కూడా తీసుకోవాలి. నష్టభయం లేకుండా ఉండేందుకు తక్కువపెట్టుబడి అవసరమయ్యే వ్యాపారం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె
ది బెస్ట్ బిజినెస్ ఐడియా..
హస్తకళ ఉత్పత్తుల విక్రయంతో తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు కళ్ల చూడొచ్చనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఏ ఉత్పత్తిని మార్కెట్ చేయదలుచుకున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి. చక్కటి ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇలాంటి ఉత్పత్తులను విక్రయించిన అనుభవజ్ఞుల సూచన తీసుకోవాలి.
నేటి జమానా అంతా ఆన్‌లైన్‌లోనే ఉంది. కొత్త ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు ఎన్నో డిజిటల్ వేదికలు అందుబాటులో ఉన్నాయి. ఇండియా మార్ట్ ఇందులో ముఖ్యమైనది. వ్యాపారులు ఇందులో ఉచితంగానే రిజిస్టర్ చేసుకోవచ్చు.
Also Read: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
ఇది ఎవరికి తగినదంటే..
కాలేజీ విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు, గృహిణులకు హస్తకళలు అత్యంత అనుకూలమైనదని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ముడిసరుకులకు పెద్దగా షాపింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఓ డిజైన్‌ను ఎంచుకున్నాక దాన్ని తయారు చేసి నమూనాను సిద్ధం చేసుకుని దాని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవాలి. ఆన్‌లైన్‌లో వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి మార్పులు చేర్పులు చేసుకుని మార్కెట్‌లోకి విడుదల చేయాలి. చెయిన్లు, బ్యాంగిల్స్, చెవి పోగులు, బొమ్మలు, ఫర్నీచర్ వంటివాటిని సిద్ధం చేసి మార్కెట్ చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలనేదానిపై శిక్షణ ఇచ్చే సంస్థలు అనేకం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి లాభాలు కళ్లచూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Read More Business News and Latest Telugu News