Share News

ఐపీఎల్‌ను వీడిన రబాడ

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:08 AM

దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ స్వదేశానికి తిరిగి వెళ్లినట్టు అతడి ఫ్రాంచైజీ గుజరాత్‌ టైటాన్స్‌ ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఐపీఎల్‌ను వీడినట్టు గురువారం పేర్కొంది...

ఐపీఎల్‌ను వీడిన రబాడ

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ స్వదేశానికి తిరిగి వెళ్లినట్టు అతడి ఫ్రాంచైజీ గుజరాత్‌ టైటాన్స్‌ ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతోనే అతడు ఐపీఎల్‌ను వీడినట్టు గురువారం పేర్కొంది. కానీ, తిరిగి వస్తాడా? లేదా? ఒకవేళ వస్తే ఎప్పుడు? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ సీజన్‌లో రబాడ రెండు మ్యాచ్‌లే ఆడాడు. బుధవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతడి స్థానంలో అర్షద్‌ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకొన్నారు. రబాడ గైర్హాజరీలో సౌతాఫ్రికాకు చెందిన గెరాల్డ్‌ కొట్జీ లేదా అఫ్ఘాన్‌ ఆల్‌రౌండర్‌ కరీమ్‌ జనత్‌పై గుజరాత్‌ ఆధారపడే చాన్సుంది. కాగా, లీగ్‌లో పిచ్‌లపై విమర్శలు చేయడంతో.. బీసీసీఐ అతడిని టార్గెట్‌ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రబాడ లీగ్‌ను వదలి వెళ్లాడని అనుకొంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2025 | 04:08 AM