వార్న్ మృతిలో కొత్త కోణం!
ABN , Publish Date - Mar 31 , 2025 | 02:39 AM
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతిపై కొత్త కోణం వెలుగు చూసింది. వార్న్.. 2022, మార్చి 4న థాయ్‌లాండ్‌లోని ఓ ద్వీపంలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే...

ఘటనాస్థలంలో లైంగిక సామర్ధ్యాన్ని
పెంచే ఔషధ బాటిల్ లభ్యం
అంతర్జాతీయ మీడియా కథనం
లండన్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతిపై కొత్త కోణం వెలుగు చూసింది. వార్న్.. 2022, మార్చి 4న థాయ్‌లాండ్‌లోని ఓ ద్వీపంలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వార్న్ చనిపోయాక అతడు బస చేసిన విల్లా నుంచి ఓ వస్తువును తొలగించినట్టుగా అంతర్జాతీయ పత్రిక ‘డెయిలీ మెయిల్’ సంచలన కథనం ప్రచురించింది. లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఓ ఔషధ బాటిల్ అక్కడ లభ్యమైందని, అయితే ఆసీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో బాటిల్‌ను అక్కడి నుంచి తీసేసినట్టుగా ఓ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పినట్టు ఆ పత్రిక పేర్కొంది. వాటిని వార్న్ ఎంత మోతాదులో తీసుకున్నాడో తమకు తెలియదని, కానీ ఆ సమయంలో సున్నితమైన అంశం కావడంతో ఇది బహిర్గతం కాలేదని ఆ పోలీస్ అధికారి అన్నాడని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్
IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..