అసంఘటిత రంగ కార్మికుల అరెస్టు సరికాదు
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:31 AM
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాకు బయలుదేరిన అసంఘటిత రంగ కార్మికు లను అరెస్టు చేయడం సరికాదని సీఐటీయూ నాయకులు అన్నారు.

నేరేడుచర్ల, మార్చి 22(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాకు బయలుదేరిన అసంఘటిత రంగ కార్మికు లను అరెస్టు చేయడం సరికాదని సీఐటీయూ నాయకులు అన్నారు. కార్మికుల అరెస్టుకు నిరసనగా నేరేడుచర్లలో శనివారం రాస్తారోకో చేశారు. సంఘం మండల కన్వీనర్ నీలా రాంమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన చలో హైదరాబాద్‌ను నిర్వీర్యం చేసే ందుకు ముందస్తు అరెస్టు చేయడం సరికాదన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గంజి రవీందర్, సైదా, సత్యం, రామారావు, నరేష్, కొండలు, శ్రీను, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్: అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలక సోమయ్యగౌడ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్మికులను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీను, రాంబాబు, పద్మ, జయకృష్ణ, అంజయ్య, ముస్తఫా, రాంబాబు, నాగేశ్వరరావు, గోపి, సైదులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తిరుమలగిరి: ఏ కారణం లేకుండా సీపీఎం నాయకులను అరెస్టు చేయడం ఏమిటని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కడెం లింగయ్య ప్రశ్నించారు. తిరుమలగిరిలో నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. రెండు రోజులుగా పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వలేదని, అయినా పోలీసులు తనతో పాటు, నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారన్నారు. రాత్రి సమయంలో తమ ఇళ్లకు వచ్చి అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు. కార్యక్రమంలో కడారి లింగ య్య, పానుగంటి శ్రీను, నాగేష్, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.