Share News

Bird Flu: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:49 AM

గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ కారణంగా మరణించింది. ఆమెకు బర్డ్‌ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు పరీక్షల్లో ధ్రువీకరించారు, దీంతో వైద్య ఆరోగ్య శాఖ స్థానికంగా సర్వేలెన్స్ చేపట్టింది.

Bird Flu: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి

నరసరావుపేట పట్టణంలో ఘటన

అనారోగ్యం కారణంగా గత నెలలో

మంగళగిరి ఎయిమ్స్‌లో చిన్నారి చేరిక

చికిత్స పొందుతూ మృత్యువాత

శాంపిల్స్‌ను పరీక్షించి బర్డ్‌ఫ్లూగా

నిర్ధారించిన వైద్య అధికారులు

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ మళ్లీ కలకలం రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూ (ఎవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా/హెచ్‌5ఎన్‌1) మరణం నమోదైంది. పట్టణంలోని బాలయ్య నగర్‌కు చెందిన పెండ్యాల జ్యోతి అనే రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూతో చనిపోయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు మంగళవారం ధ్రువీకరించారు. గత నెలలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆ చిన్నారి అక్కడ చికిత్స పొందుతూ గత వారం ప్రాణాలు విడిచింది. అయితే బర్డ్‌ఫ్లూ లక్షణాలుగా అనుమానించిన వైద్యులు చిన్నారి శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఈ పరీక్షల్లో జ్యోతికి బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నేతృత్వంలో వైద్య సిబ్బంది స్థానికంగా సర్వేలెన్స్‌ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..

ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..

జీవితాంతం సమాజం కోసమే

For More AP News and Telugu News

Updated Date - Apr 02 , 2025 | 02:50 AM