BRS: ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం: కేటీఆర్
ABN , Publish Date - Jan 21 , 2025 | 10:34 AM
ఒకే రోజు నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిదని.. రైతు రాజ్యం కాదిది.. రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్ళలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిదని అన్నారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Ministr KTR) ట్విట్టర్ (Twitter) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ఒకే రోజు నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్న ప్రభుత్వమిదని.. రైతు రాజ్యం కాదిది.. రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదని దుయ్యబట్టారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్ళలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమిదని అన్నారు. ‘‘కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్.. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలు.. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు.. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు.. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి.. వారి కన్నీళ్లే కపట సర్కార్‌ను కూల్చి వేస్తాయి’’ అంటూ కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
సీ పోర్టు.. వాటాలు కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో..
రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ..
రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్ తరఫున ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో 9 మందితో ఏర్పాటుచేసిన ఈ కమిటీలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ ఉన్నట్లు తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా రెండు వారాలపాటు విస్తృతంగా పర్యటించి రైతు ఆత్మహత్యలకు గల కారణాలను గుర్తిస్తుందని చెప్పారు. ఏడాదిలో వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి ఒక నివేదికను తయారు చేస్తుందని వివరించారు. క్షేత్రస్థాయి దుర్భర పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రికి, బీఆర్‌ఎ్‌స అధినేత కేసీఆర్‌కు నివేదికను అందజేస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఇప్పటికే 400 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకరమన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేేసలా ప్రధాన ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషించాలన్న సదుద్దేశంతోనే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ.. రేవంత్‌రెడ్డికి చుక్కలు చూపించాలని, ఒక కార్మికునికి కష్టం వేస్త అందరూ కలిసి ఉద్యమించాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. క్యాలెండర్‌ను తేదీలు మారేదిగా కాకుండా.. పోరాటాలు చేేసలా విధంగా ఉపయోగించాలన్నారు. మే 1 కార్మిక దినోత్సవం వరకు ప్రభుత్వం తమహామీలు అమలు చేసేలా 15 రోజులకో కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకొని ఉద్యమించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అట్టహాసంగా ప్రారంభమైన వరల్డ్ ఎకనికమిక్ ఫోరం సదస్సు
కాశ్మీర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రా జవాన్ మృతి
ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News