Share News

Hyderabad Gun Firing: హైదరాబాద్ పబ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. ఏకంగా 23 బులెట్లు

ABN , Publish Date - Feb 02 , 2025 | 03:57 PM

Hyderabad Gun Firing : గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ప్రిజం పబ్‌కు తరుచూ బత్తుల ప్రభాకర్ వస్తున్నట్లు తెలిసిందని.. దీంతో అతడిని పట్లుకునేందుకు వెళ్లడంతో కాల్పులు జరిపాడని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు. బీహార్ నుంచి బత్తుల ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని అన్నారు.

Hyderabad Gun Firing: హైదరాబాద్ పబ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. ఏకంగా 23 బులెట్లు
Hyderabad Gun Firing

హైదరాబాద్‌: గచ్చిబౌలి ప్రిజం పబ్బు కాల్పుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకులను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై నిన్న(శనివారం) కాల్పులు జరిపి ప్రభాకర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రాంరెడ్ఢి, ఇద్దరు బాన్సర్లు గాయపడ్డారు. కానిస్టేబుల్ తోడలోకి బులెట్ దూసుకుపోయింది. గాయపడ్డ కానిస్టేబుల్‌ను స్థానిక కాంటినెంటల్ హస్పిటల్‌కు పోలీసులు తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్పాట్‌లోనే ప్రభాకర్ నుంచి రెండు తుపాకులను, 23 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ మీడియాకు వెల్లడించారు.


ప్రిజం పబ్‌కు తరుచూ బత్తుల ప్రభాకర్ వస్తున్నట్లు తెలిసిందని.. దీంతో అతడిని పట్టుకునేందుకు వెళ్లడంతో కాల్పులు జరిపాడని చెప్పారు. బీహార్ నుంచి బత్తుల ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. మూడు తుపాకులతో పాటు నిందితుడి నుంచి చోరీకి ఉపయోగించే పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రభాకర్‌పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేశామని.. ఆయన గదిలో మరొక తుపాకీ స్వాధీనం చేసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు.


మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడి రూమ్‌లో ప్రభాకర్ బస చేశారని చెప్పారు. వైజాగ్ జైల్లో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేశారని అన్నారు. జైల్లో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు కుట్ర పన్నారన్నారు. ప్రభాకర్‌ను విచారిస్తున్నామని ఈ విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రభాకర్‌‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయని తెలిపారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 16 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2023 నవంబర్ నుంచి ప్రభాకర్‌‌ తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. మొయినాబాద్‌ చోరీ కేసులో ప్రభాకర్ వేలిముద్రలను గుర్తించామని అన్నారు. ఆ డేటాతో సీసీ కెమెరాలను జల్లెడ పట్టినట్లు చెప్పారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా మాస్కులు ధరిస్తూ ప్రభాకర్‌ పరారీ అవుతున్నాడని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు.. విచారణ చేస్తున్న పోలీసులు..

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

Fire Accidents: పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Feb 02 , 2025 | 04:09 PM