Share News

Minister Seethakka: ఆ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది.. సీతక్క విసుర్లు

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:56 PM

Minister Seethakka: కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పని చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.

   Minister Seethakka: ఆ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది.. సీతక్క విసుర్లు
Minister Seethakka

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట రూ. 22 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇవాళ(శనివారం) నందిగామ మండలం చేగూరులో మహిళలకు రూ.23 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. వేల ఎకరాలు ఉన్న ఆసామికి కూడా కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం అసలైన రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళలకు సంవత్సరానికి ఒక్క చీర ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ఉద్ఘాటించారు. మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలు అభివృద్ధి చెందినప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు.


రైతులు ముందుకు రావాలి: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

Sudarshan-Reddy.jpg

నిజామాబాద్: నిజాంషుగర్ ఫ్యాక్టరీని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా లే ఆఫ్ చేసిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. చెరుకు రైతులకు అవగాహన సదస్సు శనివారం జరిగింది. ఈ సదస్సులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఫ్యాక్టరీ తెరిపించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. చెరుకు పండించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణపై అనుమానాలు, అపోహలు వద్దని చెప్పారు. ఫ్యాక్టరీ నడవాలంటే 6 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు అవసరమని తెలిపారు. రెండు నెలల్లో మరమ్మత్తులు పూర్తి చేస్తామన్నారు. అవసరమైతే మరో చోటకు ఫ్యాక్టరీని తరలిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు.


చెరుకు సాగుకు రూ.500 బోనస్ ఇవ్వాలి: మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు

Mandava-Venkateswara-Rao.jpg

చెరుకు సాగుకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు కోరారు. చెరకు రైతుల అవగాహన సదస్సులో మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం వరి సాగు చేసిన రైతులకు బోనస్ ఇచ్చినట్లే చెరుకు సాగు చేసిన రైతులకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించేందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఇప్పటికే ఫ్యాక్టరీ బ్యాంకు బకాయిలు రూ.160 కోట్లు చెల్లించడం కోసం కృషి చేశారని గుర్తుచేశారు. పాత మిషనరీ స్థానంలో కొత్త మిషనరీని ఏర్పాటు చేయాలని కోరారు. ఫ్యాక్టరీ ఆధునిక హంగులతో ఏర్పాటు చేస్తే త్వరితగతిన రైతులకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. వరి సాగులో ఎరువుల వినియోగంతో సాగునీరు వృథా అవుతోందని చెప్పారు. ఒక ఎకరా వరి సాగుతో ఆరు ఎకరాల చెరుకు సాగును చేయవచ్చు అని మండవ వెంకటేశ్వరరావు తెలిపారు.


షుగర్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది: షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్

షుగర్ ఫ్యాక్టరీను తెరిపించాలనే డిమాండ్ రైతుల నుంచి వచ్చిందని షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ తెలిపారు. చెరకు రైతుల అవగాహన సదస్సులో షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ మాట్లాడారు. ఫ్యాక్టరీలు తెరవాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ కోసం రూ. 190 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తుచేశారు. ఫ్యాక్టరీలు లాభాల్లో నడవాలంటే 80 శాతం క్రషింగ్ జరగాలని చెప్పారు. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడవాలంటే 16 నుంచి 18 వేల ఎకరాల్లో రైతులు చెరుకు పండించాలని తెలిపారు. పంట సాగుకు రైతులు ముందుకు వస్తే విత్తనాలు, డ్రిప్ ఇతర ప్రోత్సాహకాలు అందిస్తామని షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG News: కేక్ తింటున్నారా.. జాగ్రత్తండోయ్

Hyderabad: కొంతమంది తెలుగు భాషను చిన్నచూపు చూస్తున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

HYDRA: హైడ్రా మరో కీలక నిర్ణయం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 04 , 2025 | 07:04 PM