Search Operation: మావోయిస్టు నేత హిద్మా టార్గెట్‌గా భారీ సెర్చ్ ఆపరేషన్
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:29 PM
తెలంగాణ సరిహద్దు మారేడు బాక అడవుల్లో మావోయిస్టులకు.. భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ గెరిల్లా (Maoist Guerrilla) సుప్రీం కమాండర్ (Supreme Commander) మడవి హిద్మా (Madavi Hidma) టార్గెట్ (Target)గా భారీ సెర్చ్ ఆపరేషన్ (Search Operation)కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సౌత్ బస్తర్ డివిజన్ పామేడు, బాసగూడ, ఉసూర్ పరిధిలో పీఎల్‌జీ బెటాలియన్ 1కు.. భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృత దేహాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు... మృతులను గుర్తించే పనిలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం పోలీసులు ఎన్ కౌంటర్ మృతులు పేర్లు వెల్లడించనున్నారు.ఈ ఎన్ కౌంటలో అగ్ర నేతలు హతం అయ్యారా.. లేనిది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దు దండ కారణ్యం వార్ జోన్‌గా మారింది.
నివురు గప్పిన నిప్పులా తెలంగాణ, ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
ఛత్తీస్ గడ్ (Chhattisgarh), బీజాపూర్ జిల్లా (Bijapur District)లో జరిగిన ఎన్ కౌంటర్ (Encounter)తో తెలంగాణ పోలీసులు (Telangana Police) అప్రమత్తమయ్యారు (Alerted). తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దును హై అలర్ట్ చేశారు. తెలంగాణ సరిహద్దు మారేడు బాక అడవుల్లో మావోయిస్టులకు.. భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా ఛత్తీస్‌గడ్, బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. తెలంగాణ సరిహద్దు మారేడు బాక, పూజారి కాంకేర్ అడవుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు హత మయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజాపూర్... సుకుమా దంతెవాడ జిల్లాల డీఅర్‌జి , కోబ్రా సీఆర్‌ఫీఎఫ్ బలగాల సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. అభూజ్ మడ్ టార్గెట్‌గా ఆపరేషన్ కగార్ జరిగింది. ఎన్ కౌంటర్ ఘటనా స్థలం చుట్టు పక్కల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
వెంటాడి.. వేటాడి...
తెలంగాణ సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో.. ఛత్తీస్‌గడ్‌లోని మారేడుబాక అడవుల్లో తుపాకులు గర్జించాయి. డీఆర్‌జీ, కోబ్రా బలగాలకు చెందిన వెయ్యి మంది నిర్వహించిన ఆపరేషన్‌లో.. తమకు తారసపడ్డ మావోయిస్టులను రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి.. వేటాడి కాల్చిచంపారు. పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ సమీపంలోని మారేడుబాక అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతా బలగాలకు ఉప్పందింది. దీంతో.. గురువారం సుమారు వెయ్యి మంది డీఆర్జీ, కోబ్రా బలగాలు కూంబింగ్‌కు ఉపక్రమించాయి. ఉదయం 9 గంటల సమయంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో.. ఇరువైపులా కాల్పులు మొదలయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకు కాల్పులు కొనసాగాయి. ఓ దశలో తమవైపు నష్టం జరుగుతున్నట్లు గుర్తించిన మావోయిస్టులు అడవుల్లోకి వెళ్లగా.. బలగాలు వారిని రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను, భారీగా ఆయుధాలు, మందుపాతరలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో తెలుగువారు ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వివరాలు తెలుస్తాయని చెప్పారు. కాగా.. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 20 మంది నక్సల్స్ మృతిచెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ కార్యాలయం తెలిపింది.
కమల్‌దాస్ ఉసెండీ లొంగుబాటు
మావోయిస్టు పార్టీలో టెక్నికల్ టీమ్ కమాండర్‌గా పనిచేస్తున్న గింజురాం అలియాస్ కమల్‌దాస్ ఉసెండీ గురువారం ఛత్తీస్‌గడ్‌లోని కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 27 ఏళ్లుగా ఇతను నక్సల్‌బరి ఉద్యమం, మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. మిలీషియా సభ్యుడుగా కూడా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం టెక్నికల్ టీమ్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కమల్‌దాస్‌పై రూ.25 లక్షల రివార్డు ఉందని, ప్రభుత్వం తరఫున ఇతనికి ప్యాకేజీని అందజేస్తామని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత
ఈనెల 26వ తేదీ నుంచి రైతు భరోసా..
మత్స్యకారుడు మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News