ఈజీఎస్ కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:04 AM
పని ప్రదేశాల వద్ద కూలీలకు అన్నిరకాల వసతులు కల్పించాలని జిల్లా అడిషనల్ డీఆర్‌డీ వో మదన్‌మోహన్ సూచించారు.

ఫ అడిషనల్ డీఆర్‌డీవో మదన్‌మోహన్
కథలాపూర్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : పని ప్రదేశాల వద్ద కూలీలకు అన్నిరకాల వసతులు కల్పించాలని జిల్లా అడిషనల్ డీఆర్‌డీ వో మదన్‌మోహన్ సూచించారు. మండలంలోని పోసానిపేటలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను ఆయన పరిశీలించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పనులు జరిగేచోట తాగునీరు, ఎండకు నీడ కోసం టార్పాలిన్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. కూలీల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. పనులను త్వరితగతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంపికైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచిం చారు. ప్రభుత్వం నిర్దేశించిన దశల్లో డబ్బుల చెల్లింపు ఉంటుందన్నారు. కూలీల హాజరు నమోదుకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్‌నాయక్, పంచాయతీ కార్యదర్శి సులోచన పాల్గొన్నారు.