చేతి వృత్తులకు వరం..
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:10 AM
చేతి వృత్తుల వారిని అదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రవేశ పెట్టింది.

ప్రధాని విశ్వకర్మ యోజన
-- పలు అంశాల్లో ఉచిత శిక్షణ
తిమ్మాపూర్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): చేతి వృత్తుల వారిని అదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనను ప్రవేశ పెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా 17 సెప్టెంబరు 2023న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం 18 విభిన్న రంగాలకు చెందిన కళాకారులకు శిక్షణతోపాటు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో కార్పెంటర్, బోట్ మేకర్, ఆర్మర్, కమ్మరి, తాళాలు చేసేవారు, గోల్డ్ స్మిత్, కుండల తయారీదారులు, శిల్పి, తాపీ మేస్త్రీ, మత్యకార వలలు తయారు చేసేవాళ్లు, రాయి కొట్టేవారు, చెప్పులు కుట్టేవారు, బుట్ట, చాప, చీపుర్లు, గార్లండ్ మేకింగ్ (మలకార్), బొమ్మల తయారీదారులు, టైలరింగ్, నాయి బ్రహ్మణులు వంటి సాంప్రదాయ వృత్తుల వారు ఉన్నారు. ఎంపికైన వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి అనంతరం లబ్ధిదారులకు వ్యాపారం చేసేందుకు అర్హులైన వారికి తక్కువ వడ్డీకి రుణం అందిస్తారు.
ఫ అర్హతలు:
ఈ పథకానికి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులు దరఖాస్తు చేసుకోవచ్చ. వ్యాపారాల్లో నైపుణ్యం కలిగి, చేతి వృత్తులు సాగించే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొడానికి అర్హులు.
ఫ ఇలా దరఖాస్తుల చేసుకోవాలి
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో చేరే వారు ముందుగా సంబందిత ప్రభుత్వ వెబ్ సైట్ (ఞఝఠిజీటజిఠ్చీజ్చుటఝ్చ.జౌఠి.జీుఽ)లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు గానీ, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి. ఆదాయ ధ్రువీకరణ పత్రం, చిరునామాను నిర్ధారించే పత్రం, పథకానికి సంబందించి ఆర్దిక లావాదేవీలు నిర్వహణకు బ్యాంకు ఖాతా వివరాలతో ధరఖాస్తు చేసుకొవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం పూర్తి అయిన తరువాత వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత అర్హులైనా వారిని ఉచిత శిక్షణకు పిలుస్తారు.
ఫ ప్రయోజనాలు
ఈ పథకం కొసం ధరఖాస్తు చేసుకున్న తరువాత నైపుణ్య శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన ఉచితంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయల స్టైఫండ్, శిక్షణ అనంతరం సర్టిపికేట్, గుర్తింపు కార్డును ఇస్తారు. వ్యాపారానికి అవసరమయ్యే పరికరాల కిట్‌ను కాని, కిట్ కొనుగోలుకు అవసరమైనా ఆర్థిక సహాయం కాని అందజేస్తారు.
ఫ మహిళా ప్రాంగణంలో..
తిమ్మాపూర్ మండలంఎల్‌ఎండి కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా మహిళాలకు పలు చేతి వృత్తులకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. దండలు అల్లడం, చీరల కొంగులు ముడివేయడం, బొకేస్ తయారు చేయడం, ఎన్వలప్, హోమ్ డెకరేటర్ వస్తువులు, ఇయర్ రింగులు, బ్యాంగిల్స్ డిజైౖన్, పేపర్ ఫ్లవర్స్ తయారీపై శిక్షణ నిస్తున్నారు. ఇప్పటికి నాలుగు బ్యాచులకు శిక్షణ పూర్తి అయ్యింది. ఒక్కో బ్యాచ్‌లో 10 నుంచి 17 మంది మహిళాలకు శిక్షణ ఇస్తున్నారు.
ఫ శిక్షణ బాగుంది..
ఎన్ లత, వేములవాడ
కార్యదర్శులు చేబితే అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ బాగుంది. పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
ఫ ఉపాధి అవకాశాలు ఉంటాయి
రాజ వర్ధిణి, ట్రైనర్
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో చేరి శిక్షణ పొందుతున్న మహిళాలకు ఉపాధి అవకాశాలు బాగుంటాయి. ఇంట్లో ఉండి కూడా జీవనోపాధి పొందొచ్చు. బ్యాంగిల్స్ డిజైన్, ఇయర్ రింగ్స్, పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నాం.
ఫ నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చాం..
- వి సుధారాణి, ప్రాంగణం జిల్లా మేనేజర్
ఇప్పటి వరకు నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చాం. ఒక్కో బ్యాచ్‌లో 10 నుంచి 17 మంది మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. నిరుపేదలకు ఈ పథకం వరం లాంటింది. ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్ ఇస్తున్నాం. శిక్షణ అనంతరం ఉపాధి పొందేందుకు సహకారం అందజేస్తాం.