Share News

సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుంది

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:13 AM

సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌తో పాటు పలుగ్రామాల్లో సీసీరోడ్లు, సన్నబియ్యం పేదలకు అందించే కార్యక్రమాలను ప్రారం భించారు.

సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుంది

కాల్వశ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌తో పాటు పలుగ్రామాల్లో సీసీరోడ్లు, సన్నబియ్యం పేదలకు అందించే కార్యక్రమాలను ప్రారం భించారు. ఆయన మాట్లా డుతూ ఏ రాష్ట్రంలో అమలు చేయ ని విధంగా రాష్ట్రంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం అందజే స్తున్న ఘనత ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఎ స్సారెస్పీ ఆయకట్టు చివరి మండలానికి సాగునీరు అందించి రైతుల పంటలు కాపా డామన్నారు. సన్నవడ్లు పండించే రైతులం దరికీ బోనస్‌ ఇవ్వడంతో పాటు రెండు లక్షల రుణమాఫీ కూడా చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా గతంలో రాష్ట్రం 60వేల కోట్ల అప్పు ఉంటే పది సంవత్సరాలు పాలించిన బీఆర్‌ఎస్‌ 7.30 లక్షలు అప్పు చేసిందన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజల మీద ఎలాంటి భారం వేయ కుండా అప్పు, వడ్డీ కడుతున్నాన్నారన్నారు. అనంతరం సోన్నాయి టెంకం లక్ష్మయ్య స్మార క చలివేంద్రంను ప్రారంభించారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్‌, తహసీల్దార్‌ జగదీశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్‌ శంకర్‌, ఎంపీడీవో పూర్ణచంద్రరావు, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ రామిడి తిరుపతిరెడ్డి, సిం గిల్‌విండో చైర్మన్‌ రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, సబ్బని రాజమల్లు, పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:13 AM