నేడు రంజాన్
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:33 AM
భక్తి విశ్వాసాలు, ఉపవాస దీక్షలు, జకాత్, పిత్రా వంటి దానధర్మాలకు ప్రతీకగా భావించే ఈదుల్ ఫితర్ (రంజాన్)ను సోమవారం ముస్లింలు జరుపుకోనున్నారు. ఆదివారం రాత్రి నమాజుల అనంతరం నెలవంక కనిపించడంతో రంజాన్ మాస ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కరీంనగర్ కల్చరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): భక్తి విశ్వాసాలు, ఉపవాస దీక్షలు, జకాత్, పిత్రా వంటి దానధర్మాలకు ప్రతీకగా భావించే ఈదుల్ ఫితర్ (రంజాన్)ను సోమవారం ముస్లింలు జరుపుకోనున్నారు. ఆదివారం రాత్రి నమాజుల అనంతరం నెలవంక కనిపించడంతో రంజాన్ మాస ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నెల రోజుల దీక్ష ముగించి మరుసటి రోజు ప్రత్యేక నమాజ్ సామూహికంగా చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. మాసమంతా ఖురాన్ పఠనంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు చిన్నా పెద్దా తేడా లేకుండా అల్లాహ్‌పై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
ఫ మార్కెట్‌లో సందడి
రంజాన్ వస్త్రాలు, వస్తువుల కొనుగోళ్లతో రెండు, మూడు రోజుల నుంచి మార్కెట్ సందడిగా మారింది. ముస్లింలు షాపింగ్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. గిరాకీ బాగుంటుందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగాయంటూ కొనుగోలుదారులు వాపోతున్నారు. వస్త్ర, వ్యాపార సముదాయాలు జన జాతరను మరపిస్తున్నాయి. పురుషులు బట్టలు, టోపీలు, అత్తర్లు, స్ర్పేలు, భుజాలపై టవల్స్, స్వీట్లు, సేమియాలు, స్త్రీలు బట్టలు, గాజులు, సుర్మా, మెహందీ, అలంకరణ సామగ్రి కొంటున్నారు. గృహాలంకరణ సామగ్రికి గిరాకీ పెరిగింది. లాల్చీలు, పైజామాలు, ఫ్రాక్‌లు, పిల్లల కుర్తాలు, రెడీమెడ్‌గా లభ్యమౌతుండడంతో కొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఫ నెలవంక దర్శనంతో నెలకొన్న సందడి
నెలవంక దర్శనమిచ్చింది. మసీదులు, ముస్లింల గృహల్లో సందడి నెలకొంది. ముస్లింల ముఖాల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. ఆదివారం రాత్రి నమాజుల అనంతరం నెలవంక కనిపించడంతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసం ముగింపు సూచకంగా భావించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు.
ఫ ఈద్గాల్లో ఏర్పాట్లు
రంజాన్ సందర్భంగా పలు ఈద్గాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం సామూహిక ప్రార్థల దృష్ట్యా మున్సిపల్, పోలీసు, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. షామియానాలు, టెంట్లు, కార్పెట్లు, సౌండ్ సిస్టంలు, త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ప్రార్థనల సమయంలో పోలీసులు వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టనున్నారు.
ఫ నేడు ఈద్గాల్లో నమాజు... సందేశాల వివరాలు
నగరంలోని, నగర శివారులోని పలు ఈద్గా మైదానాల్లో సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల లోపు సామూహిక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద గల పురానీ (ఖదీమ్‌షాహి) ఈద్గాలో 9 గంటలకు సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రి నమాజ్ చేయించి సందేశమివ్వనున్నారు. చింతకుంట ఈద్గాలో 9-15 గంటల నుంచి ముఫ్తీ ఎత్తెమాదుల్ హక్ నమాజ్ చేయించనుండగా మొహమ్మద్ ఖైరొద్దీన్ సందేశమివ్వనున్నారు. సాలెహ్‌నగర్ ఈద్గాలో ఉదయం 9 గంటలకు కరీంనగర్ సదర్ ఖాజీ మన్‌ఖబత్‌షాఖాన్ నమాజ్ చేయించనుండగా ముఫ్తీ మహమ్మద్ ఘియాస్ మొహియొద్దీన్ సందేశమివ్వనున్నారు.