జై హనుమాన్
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:29 PM
హనుమాన్ జయంతి ఉత్సవాలు జిల్లా వ్యా ప్తంగా ఆంజనేయస్వామి దేవాలయాల్లో శనివారం ఘనంగా జరిగాయి.

- ఘనంగా ఆంజనేయస్వామి జయంతి
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- సాయంత్రం కొనసాగిన శోభాయాత్ర
నారాయణపేట/నారాయణపేట రూరల్/మక్తల్/మక్తల్(ఊట్కూరు)/కోస్గి/మరికల్/మాగనూరు/దామరగిద్ద, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): హనుమాన్ జయంతి ఉత్సవాలు జిల్లా వ్యా ప్తంగా ఆంజనేయస్వామి దేవాలయాల్లో శనివారం ఘనంగా జరిగాయి. శోభాయాత్రలో జైశ్రీరా మ్, జైహనుమాన్ నామస్మరణ మారుమోగింది. ఉదయం వేళ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు, డోలారోహణం అనంతరం భక్తు లకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పేట మూల హనుమాన్ దేవాలయంలో ఆలయ అర్చకుడు బళ్లారి శ్రీపతి, భక్త బృందం ఆధ్వర్యంలో డోలారోహణం నిర్వహించారు. అనంతరం భ క్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ హరి నారాయణ భట్టడ్ ప్రారంభించి, మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు సతీష్ పాలాది ప్రసాద వితరణ చేపట్టారు. గొడుగేరి అభయాంజనేయ స్వామి దేవాలయం, బాలాజీ మందిర్‌లలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పళ్ల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద యువ ఫ్రెండ్స్ సభ్యులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నదానం చేప ట్టారు. పళ్ల మూల హనుమాన్ జాతరోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి పల్లకీసేవ, పుర వీధుల గుండా భజన సంకీర్తన కొనసాగింది. సాయంత్రం యువతకు రెట్టపట్ల పోటీలు నిర్వహించారు. సుభాష్‌రోడ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి డోలారోహణం, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం, అన్నదానం చేపట్టారు. అశోక్‌నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ, భజరంగ్‌దళ్ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఉసిర్ల ఆంజనేయస్వామి ఆలయం ముందు రాజ్‌కుమార్‌రెడ్డి రూ.లక్షా 25 వేలతో ధ్వజస్తంభం ఏర్పాటుచేసి, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
అలాగే, స్థానిక సాయివిజయ కాలనీలో శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ గీత విశ్వనాథ్ ఇంట్లో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో రామోత్సవ ముగింపు కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. సీతారాముల చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భజన సంకీర్తనలు ఆలపించారు. అంతకు ముందు వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు మాట్లాడారు.
అదేవిధంగా, పేట మండలంలోని బోయిన్ పల్లి గ్రామంలో ఆంజనేయ స్వామికి వెండి కవచధారణ చేశారు. సాయంత్రం పల్లకీసేవ నిర్వహించారు.
మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయం, చెరువుకట్ట ఆంజనేయస్వామి ఆలయం, బాలాంజనేయస్వామి ఆలయంతో పా టు వివిధ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం ఐదు గంటలకు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీన గర్, నందినీనగర్, యాదవనగర్, బ్రాహ్మణవాడి, నేతాజీనగర్, పాతబజారు, గాంధీచౌక్, ఆజాద్ నగర్ చౌరస్తా మీదుగా పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నాయ కులు పాల్గొన్నారు.
ఊట్కూర్ మండలం పగిడిమారి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ సూర్యప్రకాష్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, బిజ్వార్ ఆలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణయ్య, సభ్యులు పాల్గొన్నారు.
కోస్గి పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర శనివారం సాయంత్రం కనుల పండువగా సాగింది. ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభమైన శోభా యాత్ర రామాలయం, శివాజీ కూడలి మీదుగా తిమ్మన్నబావి శివాంజనేయస్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరికల్‌లో శనివారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ చిత్రపటాన్ని ట్రాక్టర్‌పై అలంకరించి గ్రామ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. భజన సంకీర్తనలతో, జైశ్రీరామ్, జైహనుమాన్ నినాదాలతో మరికల్ పట్టణం మార్మోగింది. గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చి శోభాయాత్రలో పాల్గొన్నారు.
మాగనూరు మండలం వర్కూరు, గురవులింగంపల్లి గ్రామాల్లో ఆంజనేయస్వామి మూల విరాట్‌కు పురోహితులు విశేష పూజలు చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామస్థులు స్వామివారికి గండజ్యోతి, నైవేద్యం సమర్పించారు. లక్ష్మి నరసింహస్వామి దేవాలయం నుంచి హను మాన్ చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు. మాజీ సర్పంచు రాజు, మధుసూదన్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, వాకిటి శ్రీనివాసులు తదితరులున్నారు.
దామరగిద్ద మండల కేంద్రంలో దాత వన్నడ వెంకటప్ప నూతనంగా నిర్మాణం చేసిన బయలు హనుమాన్ ఆలయంలో ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కానుకుర్తి, క్యాతన్‌పల్లి, దామరగిద్ద మండల కేంద్రంలో ప్రధాన రోడ్ల గుండా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.