ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:24 PM
ప్రస్తుత వేసవిలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు కోరారు.

- మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు
- ఏడో వార్డులో పర్యటన
నారాయణపేట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వేసవిలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు కోరారు. శనివారం ఉదయం ఆయన సిబ్బందితో కలిసి మునిసిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు అశోక్‌నగర్‌లో పర్యటించారు. వార్డులో ప్రతీ ఇం టికి వెళ్లి తాగునీటి సరఫరాను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఓ ఇంటికి వెళ్లగా నీరు పట్టుకుంటున్న మైనొద్దీన్ అనే వ్యక్తితో మాట్లాడారు. తాగునీరు సమృద్ధిగా వస్తుందని ఆయన కమి షనర్‌కు వివరించారు. అలాగే పారిశుధ్య సేవలు, వీధి దీపాల గురించి ప్రజలను అడిగి తెలు సుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మునిసిపల్ సిబ్బంది అధిక ప్రాధాన్యతనివ్వాలని కమిషనర్ సూచించారు. ఆ తర్వాత ఆయన అశోక్‌నగర్‌లో ఓపెన్ స్థలాలను పరిశీలించారు.