Share News

టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:35 PM

జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేలా వైద్యసిబ్బంది ప్రతీఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో సిద్దప్ప అన్నారు.

టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్దప్ప

గద్వాల టౌన్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేలా వైద్యసిబ్బంది ప్రతీఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో సిద్దప్ప అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రాజు ఆధ్వర్యంలో వైద్యవిద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో జెం డా ఊపి ప్రారంభించారు. ర్యాలీగా పాతబస్టాం డ్‌ సర్కిల్‌కు చేరి, టీబీ వ్యాధిపై ప్రజలకు అవ గాహన కల్పించారు. నర్సింగ్‌ విద్యార్ధులచే టీబీ నివారణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం టీబీ వ్యాధి తగ్గించడంలో కృషి చేసి న వైద్య సిబ్బందికి పాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో మెమెంటోలు అందజేశారు. వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ చేశారు. కార్యక్రమం లో జిల్లా జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిర, వైద్యసిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:35 PM