దాహంతో అలమటిస్తున్నా పట్టదా?
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:36 PM
మండల కేంద్రం గట్టులోని 7, 8 వార్డుల్లో తాగునీరు రావడం లేదంటూ వార్డు ప్రజలు సోమవారం గట్టు ఇన్‌చార్జి గ్రామకార్యదర్శి మునినాయక్‌తో వాగ్వాదానికి దిగారు.

- తాగునీటి కోసం గ్రామ కార్యదర్శిపై మహిళల ఆగ్రహం
గట్టు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం గట్టులోని 7, 8 వార్డుల్లో తాగునీరు రావడం లేదంటూ వార్డు ప్రజలు సోమవారం గట్టు ఇన్‌చార్జి గ్రామకార్యదర్శి మునినాయక్‌తో వాగ్వాదానికి దిగారు. చాలారోజుల నుంచి తాము తాగునీటి కోసం ఇబ్బందిపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. సమసఫ తీవ్రమవడంతో సోమవారం చాకలి శాంతమ్మ, సుజాత, లక్ష్మీ, సుమ, సరస్వతి తదితరులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఎంతకాలం ఆగాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పరిష్కరించాలని కోరారు.