Share News

ప్రారంభమైన ‘పది’ మూల్యాంకనం

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:33 PM

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైం ది.

ప్రారంభమైన ‘పది’ మూల్యాంకనం
జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న సిబ్బంది

- మొదటి రోజు 7,018 పూర్తి

- మూల్యాంకనాన్ని పరిశీలించిన డీఈవో

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైం ది. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌లో నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలకు చెందిన మొత్తం 628 మంది సజ్జెక్టు ఉపాధ్యా యులు మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. వీరిలో 384 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 64 మంది చీఫ్‌ ఎగ్జామినర్లు, 130 మంది స్పెసల్‌ అసిస్టెంట్లు, 50 మంది అదనపు సిబ్బందిని నియమించారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,34,461 విద్యార్థులకు సంబం ధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 15లోగా పూర్తి చేయా ల్సి ఉంటుంది. మొదటి రోజు మొత్తం 7,028 జవాబు పత్రాలను మూ ల్యాంకనం పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌ తెలిపారు. అందులో తెలుగు 913, హిందీ 1044, ఇంగ్లిష్‌ 634, గణితం 1043, భౌతికశాస్త్రం 1464, జీవశాస్త్రం 843, సాంఘికశాస్త్రం 1077 జవాబు పత్రా లను మూల్యాంకనం చేశారు. మూల్యాంకన ప్రక్రియను డీఈవో పర్య వేక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడూ అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో ఉపాధ్యా యుడు రోజుకు 40 జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేసేం దుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మూల్యంకనంలో ఎలాంటి పొర పాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు, విద్యాశాఖ పర్యవేక్షకులు నాగేందర్‌, కురుమయ్య, మూల్యాంకన పర్యవేక్షణ అధికారులు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:33 PM