నిందితులను కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:24 PM
ఊర్కొండపేటలో మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో నిందితులపై విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు.

- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు
- జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
నాగర్‌కర్నూల్ టౌన్/ కందనూలు /పెంట్లవెల్లి/ అచ్చంపేటటౌన్/ కోడేరు/ చారకొండ/ఊర్కొండ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఊర్కొండపేటలో మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో నిందితులపై విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్ధం పర్వతాలు మాట్లాడుతూ బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి పునరావాసం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా నాయకులు ఆర్.శ్రీనివాస్, కె.గీత, రామయ్య, అంతటి కాశన్న, మల్లయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
- బీఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం ఊ ర్కొంటపేట సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళలకు భద్రత కరువై ఇ లాంటి సంఘటనలు దురదృష్టకరమన్నారు. జి ల్లాలో ఇంటలీజెన్స్, పోలీసు విభాగాలు పటిష్టం గా పని చేసి మరోమారు ఇలాంటి సంఘటలను జరుగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి పృథ్వీరాజ్, ప్రధా న కార్యదర్శి హర్ష ముదిరాజ్, కల్వకుర్తి ఇన్‌చార్జి మీసాల రమేష్, నాయకులు కల్యాణ్, భాస్కర్, నరసింహ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- ఊర్కొండపేట ఘటనలో అదుపులోకి తీసుకున్న నిందితులపై నిర్భయ కేసు పెట్టి వి చారణ జరిపించి కఠినంగా శిక్షించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆలయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించ డంతో పాటు భధ్రత కల్పించాల్సిన భాద్యత దే వాదాయ శాఖపై అందని ఆయన పేర్కొన్నారు.
- మహిళపై గ్యాంగ్ రేపిస్టులను ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించి బా ధితురాలికి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాలనరసింహ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నాగర్‌కర్నూల్ జి ల్లా కేంద్రంలోని లక్ష్మణాచారి భవన్‌లో నిర్వహిం చారు. సీపీఐ నాయకులు బండి లక్ష్మీపతి, తన్నీ రు మల్లయ్య, కేసముల శివకృష్ణ, గుండె కృష్ణ య్య, శ్రీనివాసులు, స్వామి, సురేష్, బానపల్లి పెద్ద బొందయ్య, కుర్మయ్య పాల్గొన్నారు.
- మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా నాయకుడు ఈశ్వర్ అన్నారు. మంగళవారం పెంట్లవెల్లి మండల కేంద్రంలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. సీపీఎం మండల నాయ కులు కురుమయ్య, తిమ్మస్వామి, గోవిందమ్మ, రాము, అబ్దుల్ల, చిట్టెమ్మ పాల్గొన్నారు.
- మహిళపై అత్యాచారం చేసిన నిందితు లను కఠినంగా శిక్షించాలని అచ్చంపేటలో ఎ మ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సౌటకాశీం మంగళ వారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభు త్వం వెంటనే స్పందించి బాధిత మహిళకు రూ. 50 లక్షల పరిహారం, వైద్య సేవలు అందిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని సీపీఎం కో డేరు మండల కార్యదర్శి పి. నరసింహ డిమాం డ్ చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అదే విధంగా హైద రాబాద్ సెంట్రల్ యూనివర్సిటి భూములను వేలం పాటలు ఆపాలని విద్యార్థి సంఘాలు చేస్తున్న ఉద్యమానికి ఆయన సంఘీబావం తెలిపారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయడానికి ఆయన ఖండిస్తున్నామన్నారు.
- గ్యాంగ్ రేపిస్టులను వదిలి పెట్టకుండా అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించి బాధి తురాలికి న్యాయం చేయాలని సీపీఐ జిల్లా సమి తి సభ్యుడు డాక్టర్ చిలివేరు శ్రీనివాసులు అన్నా రు. మంగళవారం చారకొండ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. సీపీఐ మండల కార్యదర్శి ఏసారపు అ శోక్‌గౌడ్, నాయకులు జెల్ల బాలయ్యగౌడ్, మొగి ళ్ల శ్రీను, బొల్లంపల్లి సత్యనారాయణ, రాజునా యక్, కొమ్ము బారీం, బాలస్వామి పాల్గొన్నారు.
- ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయస్వామివారి ఆలయం సమీపం లోని గుట్టల వద్ద మహిళపై అత్యాచార సంఘ టన శోచనీయమని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి అంతటి నాగన్న అన్నారు. మంగళవారం మండలంలోని ఊర్కొండపేట గుట్టల వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. వారి వెంట బీఎస్పీ నాయకులు పృధ్వీరాజ్, బాలు, కల్యాణ్, భాస్కర్ తదితరులు ఉన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: నింది తులను కఠినంగా శిక్షించాలని కల్వకుర్తి డివిజన్ బీసీ సబ్ ప్లాన్ అధ్యక్షుడు రాజేందర్, జేఏసీ చై ర్మన్ సదానందంగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ్ఛల యం పరిసరాల్లో మహిళలను టార్గెట్ చేస్తున్న ఆకతాయిలను పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి వెంట బీసీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ ఉన్నారు.