Share News

చలివేంద్రం ప్రారంభం

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:03 PM

నారాయ ణపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం సత్య సాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించి, మాట్లాడారు.

చలివేంద్రం ప్రారంభం
పేట బస్టాండ్‌లో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట/మరికల్‌/నారాయణపేట న్యూటౌన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): నారాయ ణపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం సత్య సాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించి, మాట్లాడారు. ప్రతీఏటా ప్రజల దాహార్తి తీర్చేందుకు సత్యసాయి సేవా సమితి చలివేంద్రాన్ని బస్టాండ్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మా ర్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, డీఎం లావణ్య, సేవా స మితి సభ్యులు చిట్టెం మాధవరెడ్డి, మల్లికార్జున్‌, గోపీనాథ్‌, నాయకులు పాల్గొన్నారు.

అదేవిధంగా, మరికల్‌ యువక మండలి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇందిరాగాంఽధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మె ల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సూర్యమెహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వీరన్న హరీశ్‌, అంజిరెడ్డి, రాజు, శివకుమార్‌ తదితరులున్నారు.

నారాయణపేట చౌక్‌బజార్‌లో ఏర్పాటు చేసి న చలివేంద్రాన్ని ఆదివారం డీఎస్పీ లింగయ్య ప్రారంభించి, మాట్లాడారు. నారాయణపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన 1981-83 ఇంటర్‌ బ్యాచ్‌ విద్యార్థులు చలివేం ద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమ న్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి నోడల్‌ అధికారి సుదర్శన్‌రావు, భీష్మరాజ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రాజ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ర ఘువీర్‌యాదవ్‌, డాక్టర్‌ నీలవేణి, సత్యనారా యణ, వెంకట నర్సింహరెడ్డి, సాయిబాబ, సత్య నారాయణరెడ్డి, నాగభూషణం, లక్ష్మీనారాయణ తదితరులున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 11:03 PM